Santhana Prapthirasthu Review - 'సంతాన ప్రాప్తిరస్తు' రివ్యూ: మేల్ ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూపై సినిమా ఎలా ఉందంటే?
Santhana Prapthirasthu Review Telugu: విక్రాంత్, చాందిని చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి రెడ్డి నిర్మించిన సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా ఎలా ఉందంటే?

Vikranth and Chandini Chowdary's Santhana Prapthirasthu Movie Review In Telugu: 'స్పార్క్'తో విక్రాంత్ హీరోగా పరిచయమయ్యాడు. కథానాయకుడిగా ఆయన రెండో సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. అల్లు శిరీష్ 'ఏబీసీడీ', రాజ్ తరుణ్ 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. మేల్ ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. 'మధుర' శ్రీధర్ రెడ్డి, నిర్వి రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Santhana Prapthirasthu Story): చైతన్య (విక్రాంత్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆయన ఇంట్రావర్ట్. అమ్మాయిలతో మాట్లాడటానికి ఇబ్బంది పడతాడు. అనుకోకుండా ఓ రోజు కళ్యాణి (చాందిని చౌదరి)కి సాయం చేస్తాడు. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే కళ్యాణి తండ్రి (మురళీధర్ గౌడ్) ఆ పెళ్లికి ఒప్పుకోడు. పెద్దల అభీష్టాన్ని కాదని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత చైతన్య స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని తెలుస్తుంది. అప్పుడు ఏమైంది? చైతన్య, కళ్యాణి జీవితాల్లో ఏం జరిగింది? అనేది సినిమా.
విశ్లేషణ (Santhana Prapthirasthu Review Telugu): మేల్ లేదా ఫిమేల్ ఇన్‌ఫెర్టిలిటీ అనేది సున్నితమైన అంశం. దాన్ని కథగా తీసుకుని ఎటువంటి వల్గారిటీ లేకుండా చక్కటి వినోదంతో చెప్పారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఎక్కడా లైన్ క్రాస్ చేయలేదు. మురళీధర్ గౌడ్, అభినవ్ గోమఠం, వెన్నెల కిషోర్ పాత్రలతో మంచి వినోదం పండించారు. మొదటి సినిమాతో కంపేర్ చేస్తే నటనలో హీరో విక్రాంత్ ఇంప్రూవ్ అయ్యారు. తన పాత్రకు న్యాయం చేశారు. చాందిని చౌదరితో విక్రాంత్ కెమిస్ట్రీ బావుంది. సినిమాకు మెయిన్ పిల్లర్ చాందిని రోల్. ఆ అమ్మాయి బాగా నటించింది. పక్కింటి అమ్మాయి తరహాలో కనిపిస్తూ భావోద్వేగభరిత సన్నివేశాల్లో ఒదిగిపోయింది.
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?
మేల్ ఇన్‌ఫెర్టిలిటీని తీసుకుని చక్కటి వినోదం పడించడం మీద దృష్టి పెట్టిన సంజీవ్... ఎమోషనల్ సన్నివేశాల్లో మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కాన్సంట్రేట్ చేయలేదు. ఆ ఎమోషనల్ పార్ట్ కథకు, ఇంత సెన్సిటివ్ ఇష్యూకు సరిపోలేదు. ఇంకా ఉన్నప్పుడు ఇష్యూ సీరియస్‌నెస్ ప్రజలకు చేరువ అవుతుంది. ఆయన ఉద్దేశానికి న్యాయం జరుగుతుంది. సునీల్ కశ్యప్ పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. టెక్నికల్ పరంగా సినిమా బావుంది. అయితే కాస్త రన్ టైమ్ తగ్గిస్తే బావుండేది. సెన్సిటివ్ టాపిక్ తీసుకుని బాగా డీల్ చేసిన సంజీవ్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి.
కుటుంబ ప్రేక్షకులు అందరూ కలిసి చూసేలా తీసిన చక్కటి సందేశాత్మక, వినోదంతో కూడిన సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. ఉరుగుల పరుగుల ఒత్తిడి జీవితంలో సమాజానికి సందేశాన్ని ఇచ్చే చిత్రమిది. అలాగని సంజీవ్ రెడ్డి లెక్చర్లు పీకలేదు. చక్కటి వినోదంతో అందర్నీ నవ్వించారు. వినోదంతో పాటు భావోద్వేగాలపై దృష్టి పెడితే ఇంకా బావుండేది.
రేటింగ్: 3/5
Also Read: కార్తీక దీపం సీరియల్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా - అనౌన్స్ చేశారు కానీ...





















