అన్వేషించండి

Sankranthiki vasthunnam: వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్

Sankranthiki vasthunnam First Single: వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలోని ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఫస్ట్ సాంగ్‌ను రమణ గోగుల పాడారు. వెంకీ, గోగుల కాంబో 18 ఏళ్ల తర్వాత రిపీట్ అయ్యింది.

Venkatesh - Ramana Gogula Combo: టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది.   

వెంకీ మూవీ కోసం రమణ గోగుల స్పెషల్ సాంగ్

సుమారు 18 ఏండ్ల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం పని చేస్తున్నారు. వెంకీ - రమణ కాంబోలో బోలెడు హిట్ సాంగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ వింటేజ్ మేనియాను కంటిన్యూ చేసేందకు రమణ గోగులతో ఈ సినిమా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఓ పాటను పాటిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో రమణ గోగుల స్పెషల్ సాంగ్ పాడుతున్నారు. సుమారు 18 ఏళ్ల తర్వాత వెంకటేష్ - రమణ గోగుల హిట్‌ కాంబోలో పాట రాబోతోంది.ఈ సినిమా నుంచి రాబోయే ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా ఇదే” అని అని చెప్పుకొచ్చారు.

రమణ గోగుల గురించి...

తెలుగు సినిమా పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్‌గా రమణ గోగుల తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘జానీ’, ‘లక్ష్మీ’, ‘యోగి’ లాంటి సినిమాలకు ఆయన సంగీతం అందిచారు. ఈ సినిమాల్లో ఆయన పాడిన పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారు. సుమారు 18 సంవత్సరాల తర్వాత ఆయన మరోసారి గాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సాంగ్ కోసం సంగీత ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అరకులో చివరి షెడ్యూల్ షూటింగ్

ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతోంది. అరకులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు అనిల్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై పోస్టర్లు మూవీపై భారీగా అంచనాలు పెంచాయి. ఈ సినిమా ట్రయాంగిల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్‌ సహా పలువురు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని చూసుకుంటున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Read Also: ‘హ్యారీ పోటర్‌’ రేంజ్‌లో ‘ది రాజా సాబ్’, ప్రభాస్ మూవీలో కీ పాయింట్స్ రివీల్ చేసిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget