అన్వేషించండి

Actress Samyuktha: శర్వా 37లో సంయుక్త... శాస్త్రీయ నృత్యం చేస్తున్న దియా - ఫస్ట్ లుక్ చూశారా?

శర్వానంద్ హీరోగా అబ్బరాజు దర్శకత్వంతో తెరకెక్కునున్న తాజా చిత్రం ‘శర్వా 37’. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో మేకర్స్ అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Actress Samyuktha First Look From ‘Sharwa37’: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీని వర్కింగ్ టైటిల్ ‘శర్వా 37’. అంటే... శర్వానంద్ 37వ చిత్రమిది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. వారిలో ఒకరు సంయుక్త కాగా... మరొకరు యంగ్ బ్యూటీ సాక్షి వైద్య. ఇప్పటికే ఈ సినిమా నుంచి శర్వానంద్ తో పాటు సాక్షి వైద్య  ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఈ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ సంయుక్త బర్త్ డే కావడంతో మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

సంయుక్తకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్   

టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త ‘శర్వా 37’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె దియా అనే పాత్రలో నటిస్తున్నారు. ఆమె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆమెను సర్ ప్రైజ్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకునేలా ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. పేరుకు తగ్గట్టుగానే చేతిలో దీపాలను పట్టుకుని అందంగా కనిపిస్తున్నది సంయుక్త. శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన అలంకరణలో ఆహా అనిపిస్తున్నది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సినీ అభిమానులు ఈ పోస్టర్ ను చూసి ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తున్నారు.

నిత్య సాక్షి పాత్రలో వైద్య

అటు ఈ మూవీలో సాక్షి వైద్య నిత్య సాక్షి పాత్రలో నటించనుంది. ఈమె క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ను రీసెంట్ గా ఆమె బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. చక్కటి లుక్ లో అలరించింది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ‘ఏజెంట్’, ‘గాండీవధారి అర్జున’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకురాబోతున్నది.

ఈ సినిమా పేరు ఫిక్స్ అయ్యిందా?

‘శర్వా 37’ మూవీకి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో ఇదే పేరుతో బాలయ్య ఓ సినిమా చేశారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇద్దరు భామల నడుమ బాలయ్య ఎలాంటి ఇబ్బందులు పడ్డారో, ఈ సినిమాలో శర్వా కూడా అలాగే ఇబ్బంది పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కూడా ఎమోషనల్, కామెడీతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

‘శర్వా 37’ మూవీని  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. భాను బోగవరపు కథ అందించగా, నందు సావిరిగాన డైలాగ్స్ రాశారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. అజయ్ సుంకర సహ నిర్మాతగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొనసాగనున్నారు. ‘మనమే’ మూవీతో మంచి హిట్ అందుకున్న శర్వానంత్, ఈ సినిమాతో మరో హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు.

Also Read: షాక్ ఇచ్చిన రష్మిక... నెల తర్వాత తీరిగ్గా యాక్సిడెంట్, రికవరీ గురించి రివీల్ చేసిందిగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Year Ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
Embed widget