అన్వేషించండి

సామ్ నుంచి జాన్వీ వరకూ.. డీ గ్లామర్ రోల్స్ లో గ్లామరస్ హీరోయిన్స్

వెండితెర మీద అందాలు ఆరబోసే హీరోయిన్లు, అప్పుడప్పుడు గ్లామర్ ఫేజ్ నుంచి బయటికొచ్చి ఎక్స్‌పెరిమెంట్లు చేస్తున్నారు. కథ నచ్చితే పాత్ర డిమాండ్ చేస్తే డీ గ్లామర్ గా కనిపించడానికి కూడా సై అంటున్నారు. 

వారానికో కొత్త భామ పరిచయం అవుతున్న సినీ ఇండస్ట్రీలో, హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత ఆషామాషీ కాదు. ఈ గ్లామర్ ఫీల్డ్ లో యాక్టింగ్, టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు.. కాస్త గ్లామర్ కూడా ఉండాలి. అవసరమైతే స్కిన్ షో కూడా చెయ్యాలి. అయితే కేవలం గ్లామర్ షోతోనే ఇండస్ట్రీలో నెట్టుకురావాలంటే కుదరదు. అన్ని రకాల పాత్రల్లో ఆడియన్స్ ను మెప్పించగలిగితేనే ఎక్కువకాలం రాణించగలుగుతారు. కథ నచ్చితే ఎలాంటి రోల్స్‌ చేయడానికైనా సిద్ధపడే హీరోయిన్లు ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్నారు. పాత్ర డిమాండ్ చేస్తే డీ గ్లామర్ గా కనిపించడానికి కూడా రెడీ అంటున్నారు. ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు రా అండ్ రస్టిక్ క్యారెక్టర్లు చేస్తున్నారు. అలాంటి ముద్దుగుమ్మలపై ఓ లుక్కేద్దాం!

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత రూత్ ప్రభు, 'రంగస్థలం' చిత్రంలో డీ గ్లామర్ రోల్ లో కనిపించింది. రామలక్ష్మి అనే గ్రామీణ యువతి పాత్రను అద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆమె కట్టూ బొట్టే కాదు, మాట తీరు కూడా అచ్చం పల్లెటూరి అమ్మాయిలా ఉండటం ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఆ తర్వాత 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ లోనూ సామ్ డీ గ్లామర్ క్యారక్టర్ చేసింది. లైంగిక దాడికి గురైన ఎల్టీటీఈ సభ్యురాలు రాజీగా మెప్పించింది. 

‘మహానటి’ మూవీతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ సైతం డీ గ్లామర్ పాత్రల్లో మెరిసింది. ‘గుడ్ లక్ సఖి’ సినిమాలో బంజారా యువతిగా నటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన 'చిన్ని' చిత్రంలోనూ డీ గ్లామర్ రోల్ చేసింది. అలానే 'దసరా' సినిమాలో వెన్నెల పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది కీర్తి. తెలంగాణ గ్రామీణ యువతిగా హావభావాలు పలికించడమే కాదు.. పాత్రకు తగ్గట్టుగా డైలాగ్స్ చెప్పి డ్యాన్సులతో అదరగొట్టింది.

Also Read: ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న లేటెస్ట్ సినిమాలు ఇవే, రేపు మరిన్ని!

లక్కీ బ్యూటీ రష్మిక మందన్న కూడా డీ గ్లామర్ గా లుక్ లో కనిపించింది. 'పుష్ప' సినిమాలో శ్రీవల్లి అనే రాయలసీమ విలేజ్ గర్ల్ పాత్రలో ఆకట్టుకుంది. వచ్చే ఏడాది రాబోయే 'పుష్ప 2' చిత్రంతో మరోసారి అదే పాత్రలో అలరించనుంది. ఎక్కువగా గ్లామర్ రోల్స్ తోనే గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సైతం డీ గ్లామర్ గా కనిపించడానికి వెనకాడలేదు. 'కొండ పొలం' చిత్రంలో ఓబులమ్మ అనే గొర్రెల కాపరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. అలానే 'కిక్ 2' చిత్రంలో ఓవైపు డీ గ్లామర్ గా కనిపిస్తూనే, మరోవైపు మోడరన్ గర్ల్ గా ఆకర్షించింది. 

లేటెస్టుగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఈ లిస్టులో చేరిపోయింది. ఆమె టాలీవుడ్ డెబ్యూ ‘దేవర’ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా తంగం అనే పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన మరో పోస్టర్ లో జాన్వీ లంగా ఓణీలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రామలక్ష్మి, శ్రీవల్లిలను తంగం మరిపిస్తుందా అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇంతకముందు జాన్వీ 'గుడ్ లక్ జెర్రీ' సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. 
 
'విరాట పర్వం' మూవీలో వెన్నెల అనే పల్లెటూరి యువతిగా కనిపించింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం నాగచైతన్యతో చేస్తున్న చిత్రంలో జాలరి ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా కనిపించనుందని టాక్. ఇక 'కో కో కోకిల' 'ఐరా' చిత్రాల్లో నయనతార డీ గ్లామర్ రోల్స్‌లో మెరిసింది. 'బాహుబలి: ది బిగినింగ్' మూవీలో దేవసేన వంటి మిడిల్ ఏజ్డ్ విమెన్ గా అనుష్క శెట్టి ఆకట్టుకుంది. 'Rx 100' లో బోల్డ్ గా కనిపించిన పాయల్ రాజ్ పుత్.. 'అనగనగా ఓ అతిథి' సినిమాలో పూర్తి కాంట్రాస్ట్‌గా కనిపించింది. 'అభినేత్రి'లో తమన్నా భాటియా, 'ఓదెల రైల్వేస్టేషన్' సినిమాలో హెబ్బా పటేల్, 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీలో ఐశ్వర్య రాజేష్ సైతం డీ గ్లామర్ పాత్రల్లో అలరించారు. ఇలా చాలా మంది హీరోయిన్లు కేవలం గ్లామర్‌ రోల్స్ కే పరిమితం అవ్వకుండా, అవకాశం వచ్చినప్పుడు తమలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయోగాత్మక పాత్రలతో మెప్పిస్తున్నారు.

Also Read: బాలీవుడ్ లో భంగపాటు - పాన్ ఇండియా స్టార్స్ అవుదామని బోల్తాపడ్డ టాలీవుడ్ హీరోలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget