Samantha: సమంత 'మా ఇంటి బంగారం' మూవీ అప్డేట్ - ఏడాది తర్వాత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Maa Inti Bangaram: ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమంత 'మా ఇంటి బంగారం' మూవీ అప్డేట్ వచ్చేసింది. తాజాగా నెటిజన్లతో చాటింగ్ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అప్డేట్ షేర్ చేశారు సామ్.

Samantha About Maa Inti Bangaram Movie Update: స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి రీసెంట్‌గా 'శుభం' మూవీతో నిర్మాతగా మారారు సామ్. ఈ మూవీలో ఆమె గెస్ట్ రోల్‌లో నటించగా... ఆ తర్వాత ఎలాంటి మూవీ చేయలేదు. కొత్త వారిని పరిచయం చేస్తూ రూపొందించిన 'శుభం' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
కొత్త మూవీపై అప్డేట్
నిజానికి సమంత తన ప్రొడక్షన్ హౌస్ పేరిట ఫస్ట్ 'మా ఇంటి బంగారం' మూవీ అనౌన్స్ చేశారు. దీనిపై అనౌన్స్‌మెంట్ వీడియో కూడా గతేడాది రిలీజ్ చేశారు. చేతిలో గన్, మెడలో తాళి బొట్టు, రక్తంతో నిండిన ముఖంతో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా సామ్ లుక్ ఉంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఏడాది గడిచినా దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు టీం. ఇటీవల ఓ ఈవెంట్‌లో జూన్ నుంచి 'మా ఇంటి బంగారం' షూటింగ్ జరగనున్నట్లు చెప్పినా అది ట్రాక్ ఎక్కలేదు.
తాజాగా... ఇన్ స్టాలో తన అభిమానులతో చాటింగ్ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమంత ఆన్సర్ చెప్పారు. ''మా ఇంటి బంగారం' మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది?' అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు... ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు అప్డేట్ పంచుకున్నారు. స్వయంగా సామ్ ఈ అనౌన్స్‌మెంట్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత సమంతను సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ చూస్తామంటూ సంబర పడుతున్నారు.
View this post on Instagram
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌లో సమంతే ఈ మూవీని నిర్మిస్తుండగా... నందినీ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా 'మా ఇంటి బంగారం' తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి ఇతర నటీనటులు, అప్డేట్స్ వెల్లడి కానున్నాయి. గతేడాది 'సిటాడెల్: హనీ బన్నీ' యాక్షన్ వెబ్ సిరీస్‌లో తన నటనతో మెప్పించారు. రీసెంట్‌గా సామ్ 'రక్త్ బ్రహ్మాండ్' మూవీలో నటించారు.
తాజాగా 'కొత్త ప్రయాణం' అంటూ సామ్ ఓ నూతన ఇంటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సమంత. ఆ ఇంటి గోడపై 'SAM' అనే లోగో ఉండగా... ఆమె హైదరాబాద్‌లో కొత్త ఇల్లు కొనుగోలు చేశారా? లేక ముంబయిలోనే తీసుకున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. అయితే, దీనిపై సమంత ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.





















