Samantha: జీవితాన్నిఆసక్తికరంగా మార్చేది అదే: సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్నట్టు మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు.
అక్కినేని హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాపై ప్రేక్షకుల ఫోకస్ పెరిగింది. తను ఏం పోస్ట్ చేసినా కూడా దాని వెనుక ఏదో అర్థం ఉందని భావించడం మొదలుపెట్టారు నెటిజన్లు. కానీ సమంత మాత్రం తన పోస్టుల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. తన మనసుకు నచ్చింది ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక సెప్టెంబర్ 1న ‘ఖుషి’ రిలీజ్ సందర్భంగా సమంత చేసిన పోస్ట్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
‘మహానటి’ తర్వాత ‘ఖుషి’తో..
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్నట్టు మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇప్పటికే ‘మహానటి’ చిత్రంలో జంటగా నటించారు సమంత, విజయ్ దేవరకొండ. అందులో వీరు ఒక పెయిర్‌గా కనిపించింది కాసేపే అయినా వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం బాగా పండిందని ప్రేక్షకులు భావించారు. ఇక ఇలాంటి పెయిర్ కలిసి ఒక పూర్తిస్థాయి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అని అంచనాలు పెంచేసుకున్నారు. మామూలుగా శివ నిర్వాణ అంటే ప్రేమకథలకు పెట్టింది పేరు. అయితే సమంత కూడా పూర్తిస్థాయి లవ్ స్టోరీలో నటించి చాలాకాలమే అయ్యింది. శివ నిర్వాణతో కలిసి సమంత ఇంతకు ముందే ‘మజిలీ’ చిత్రాన్ని చేసింది. మరోసారి వీరిద్దరు కలిసి ఎలాంటి ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో అని అనుకున్నారంతా.
అడ్డంకుల మధ్య ‘ఖుషి’ షూటింగ్..
‘ఖుషి’ సినిమా షూటింగ్ మొదలయినప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. సమంతకు మయాసిటీస్ అనే వ్యాధి రావడంతో తను ఎక్కువగా వేరే దేశాలకు వెళ్తూ చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ‘ఖుషి’ షూటింగ్ కాస్త ఆలస్యమయ్యింది కూడా. కానీ మూవీ టీమ్ అంతా సమంత తప్పా వేరే హీరోయిన్ వద్దు అని తనకోసం ఎదురుచూశారు. ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్న వార్తలు వచ్చినా కూడా దర్శకుడు శివ.. ఎప్పటికప్పుడు అందరికీ క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు. ఇక అన్ని అడ్డంకుల మధ్య ‘ఖుషి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాకుండా ఈ మూవీని ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లడం కోసం సమంత, విజయ్ చేసిన ప్రమోషన్స్ కూడా సినిమా రిజల్ట్‌కు చాలా హెల్ప్ అయ్యాయి.
అత్యంత అదృష్టవంతురాలిని..
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఖుషి’.. మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్‌ను అందుకుంటోంది. ఈ సినిమా సక్సెస్‌పై విజయ్, సమంత ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రస్తుతం ఫారిన్‌లో ఉన్న సమంత.. ఒక క్యూట్ పోస్ట్‌తో ‘ఖుషి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా బయటపెట్టింది. ‘ఇది ఎప్పటికీ సులభం కాదు. ఒక కల నిజం అవుతుందేమో అన్న అవకాశమే జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఖుషి కోసం థాంక్యూ’ అంటూ కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. వాటికి ప్రత్యేకంగా క్యాప్షన్స్ కూడా ఇచ్చింది. ‘మొదటి ఫోటో - సినిమా రిలీజ్ తర్వాత, రెండో, మూడో ఫోటోలు - సినిమాకు ముందు (ఒత్తిడిలో), నాలుగో వీడియో - మీరు ఈ భూమి మీద ఉన్న అదృష్టవంతురాలిగా భావించేలా చేస్తారు.’ అంటూ పోస్ట్ చేసింది. ‘ఖుషి’లో సమంత ఎంట్రీకి థియేటర్లలో ప్రేక్షకులు చేసిన గోలను ఈ పోస్ట్‌లో షేర్ చేసింది సామ్.
View this post on Instagram
Also Read: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్స్‌లో అత్యధిక టీఆర్‌పీ సాధించిన ఫైనల్ ఎపిసోడ్ ఇదే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial