Samantha Wedding Ring : సమంత రాజ్ వెడ్డింగ్ - ఆమె చేతి రింగ్ వెరీ వెరీ స్పెషల్... ధర ఎంతో తెలుసా?
Samantha Wedding Ring : సమంత రాజ్‌ల వెడ్డింగ్‌లో ప్రతిదీ ప్రత్యేకమే. ఈ కపుల్ వేసుకున్న కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి వివాహ పద్ధతి కూడా చర్చనీయాంశమే. తాజాగా సమంత రింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.

Samantha Raj Nidimoru Wedding Ring Speciality : స్టార్ హీరోయిన్ సమంత, రాజ్ నిడిమోరు సోమవారం ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయం వద్ద వివాహం బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించి ప్రతీ ఒక్కటీ ప్రత్యేకమే. రాజ్ నిడిమోరు దగ్గర నుంచి వివాహ వేదిక, భూత శుద్ధి విధానలో జరిగిన వివాహ తంతు గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు సమంత పెట్టుకున్న రింగ్, కాస్ట్యూమ్ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అసలేంటీ ఆ రింగ్?
పెళ్లిలో సమంత సంప్రదాయ పట్టుచీరలో మెరవగా రాజ్ సంప్రదాయ వైట్ కుర్తాలో కాస్ట్యూమ్స్ అదరగొట్టారు. అలాగే సమంత పెట్టుకున్న రింగ్ కూడా ఎంతో ప్రత్యేకం. అసలు ఆ రింగ్ గురించి జ్యువెలరీ వ్యాపారులు ప్రత్యేకంగా వివరిస్తున్నారు. ఈ రింగ్ పోట్రెయిట్ కట్ రింగ్ అని... చాలా అరుదుగా వీటిని తయారు చేస్తారని చెప్పారు అభిలాషా ప్రెట్ జ్యువెలరీకి చెందిన అభిలాషా భండారి తెలిపారు. 'మొఘల్ కాలంలో ఇలాంటి రింగ్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. దీన్ని పోట్రెయిట్ కట్ వజ్రాలతో తయారు చేస్తారు.
పోట్రెయిట్ కట్ బలం, తేజస్సు, స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తారు. ఓ వజ్రాన్ని పగలగొట్టకుండా ప్రత్యేక విధానంలో కట్ చేసి పల్చని గాజు పలకలా తయారు చేసి ఈ రకమైన రింగ్స్ డిజైన్ చేస్తుంటారు. ఇవి చాలా అరుదుగా చేస్తారు. చూసేందుకు సులభంగా కనిపించినా దాని వెనుక ఎంతోమంది శ్రమ ఉంటుంది. నైపుణ్యం గల వారు మాత్రమే వీటిని చేయగలరు.' అని వివరించారు. సమంత తన వివాహ రింగ్ డిజైన్ ఎంచుకున్న విధానం చాలా స్పెషల్ ఎమోషనల్ అని... గతంలో బాలీవుడ్ హీరోయిన్స్ ఆలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా రింగ్స్ కంటే ఇది చాలా డిఫరెంట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ రింగ్ చూడగానే సమంత రాజ్ పేర్లు వచ్చేలా డిజైన్ చేశారని తెలుస్తోంది.
View this post on Instagram
Also Read : 'అఖండ 2' హైందవం సాంగ్ రిలీజ్ - సనాతన ధర్మం, శివయ్య గొప్పతనం వర్ణించేలా లిరిక్స్
ధర ఎంతంటే?
ఈ రింగ్ ధర దాదాపు రూ.1.5 కోట్ల విలువ ఉంటుందని జ్యువెలరీ నిపుణుడు ప్రియాంష్ గోయల్ తెలిపారు. పోట్రెయిట్ కట్ డైమెండ్ చుట్టూ ఉండగా మధ్యలో 2 లోజెంజ్ కట్ డైమండ్ ఉందని వెల్లడించారు. కొద్దిమంది ఎక్స్‌పర్ట్స మాత్రమే ఈ రింగ్ డిజైన్ చేయగలరని... అంత ఈజీ కాదని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
ముందే హింట్ ఇచ్చారా?
సమంత, రాజ్‌ల పెళ్లి ఫోటోలు సోమవారం తన ఇన్ స్టాలో సామ్ షేర్ చేయగా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె చేతికి ఉన్న రింగ్ గతంలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోల్లోనే కనిపించింది. తాజాగా ఆ ఫోటోలను షేర్ చేస్తున్న నెటిజన్లు... 10 నెలల క్రితమే ఆమెకు ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అని చర్చించుకుంటున్నారు. రీసెంట్‌గా ఈవెంట్‌లో రాజ్‌ను హగ్ చేసుకుని ఫోటోలు షేర్ చేశారు. గతంలో ఇద్దరి మధ్య డేటింగ్ వార్తలు హల్చల్ చేయగా ఈ ఫోటోలు మరింత బలం చేకూర్చాయి. సోమవారం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.






















