Maa Inti Bangaaram Teaser Trailer : సంప్రదాయం Vs ఫుల్ యాక్షన్ మోడ్ - సమంత 'మా ఇంటి బంగారం' టీజర్ ట్రైలర్ వచ్చేసింది
Maa Inti Bangaaram Teaser : స్టార్ హీరోయిన్ సమంత 'మా ఇంటి బంగారం' మూవీ నుంచి టీజర్ ట్రైలర్ వచ్చేసింది. పవర్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో సమంత అదరగొట్టారు.

Samantha's Maa Inti Bangaaram Teaser Trailer Out Now : 'శుభం' మూవీలో గెస్ట్ రోల్ తర్వాత స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ యాక్షన్ మోడ్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం'. సంక్రాంతి ముందు మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్‌గా టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
టీజర్ ట్రైలర్ ఎలా ఉందంటే?
ఓ వైపు ఫుల్ యాక్షన్ మోడ్... మరోవైపు పల్లెటూరి సంప్రదాయ చీరకట్టులో సమంత అదరగొట్టారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ తెరకెక్కినట్లు అర్థమవుతోంది. 'ఎట్లా ఇక్కడివరకూ వచ్చినాం కదా ఉండిపోదాం' అంటూ తన భర్తతో సమంత చెప్పే డైలాగ్‌తో టీజర్ ట్రైలర్ ప్రారంభం అవుతూ హైప్ క్రియేట్ చేసింది. 'చూస్తా ఉండండి. మా ఇంటి బంగారం మీ అందరిలో కలిసిపోతుంది.' అంటూ ఫుల్ యాక్షన్ మోడ్‌కు ఛేంజ్ కావడం అదిరిపోయింది.
స్టోరీ అదేనా?
ఓ సంప్రదాయ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన అబ్బాయి తన పెద్ద వారికి, కుటుంబానికి చెప్పకుండా పట్టణంలో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని సొంతూరికి తిరిగివస్తాడు. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ కుటుంబం నుంచి ఆ అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది. కట్టుబాట్ల ముసుగులో ఆ ఇంటి కోడలిని పెద్ద వారు ఎలా ముప్పుతిప్పలు పెట్టారు? అయితే, ఆ ఊరిలో ఆ కుటుంబానికి ఎదురైన సమస్యలు. ఇంటి కోడలిగా వాటిని ఆమె ఎలా అధిగమించింది అనేదే స్టోరీ అని తెలుస్తోంది.
Also Read : 'ది రాజా సాబ్' సందడి - థియేటర్లలో మొసళ్లతో ఫ్యాన్స్ హంగామా... ఆ వీడియోల వెనుక రియల్ స్టోరీ!
ఈ మూవీకి సమంత స్నేహితురాలు, ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె భర్త, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు మూవీకి స్టోరీ క్రియేట్ చేశారు. సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి, మంజుషా, శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించగా... సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సమంత సొంత ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా మూవీ రాబోతోంది. ఈ చిత్రానికి సమంత, రాజ్ నిడిమోరు దంపతులతో పాటు హిమాంక్ దువ్వూరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
View this post on Instagram






















