News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Samantha: అడ్వాన్సులు వెనక్కి తిరిగిచ్చేసిన సమంత - ‘ఖుషీ’ తర్వాత సినిమాలకు బ్రేక్?

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత త్వరలో సినిమాలకు బ్రేక్ ఇవ్వనుంది. ఈ మేరకు తీసుకున్న అడ్వాన్సులను కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసిందట. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

FOLLOW US: 
Share:

Samantha: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత ప్రస్తుతం తన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేయనుంది. ఆమె ఇప్పుడు విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమా చేస్తుంది. ఈ సినిమా మరో కొన్ని రోజుల్లో షూటింగ్ ముగియనుంది. అలాగే ఆమె హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ కి కూడా పనిచేస్తుంది. ఈ సిరీస్ షూటింగ్ కూడా అతి త్వరలో పూర్తి కానుంది. ఈ షూటింగ్ లు పూర్తి కాగానే సమంత సినిమాలకు బ్రేక్ చెప్పనుందట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత సినిమాలకు మళ్లీ బ్రేక్ చెప్పనుందని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమంతకు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు సామ్ ఫ్యాన్స్. 

తీసుకున్న అడ్వాన్సులు తిరిగిచ్చేసిన సమంత..

గత కొంత కాలంగా సమంత అటు సినీ జీవితం ఇటు వ్యక్తిగత జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కుంటోంది. గతంలో మయోసైటిస్ అనే కండరాల వ్యాధి రావడం. తర్వాత కొన్నాళ్లు ఆసుపత్రిలో చికత్స తీసుకొని మళ్లీ షూటింగ్ లకు రావడం. వరుస షూటింగ్ లు, షూటింగ్ సమయంలో చేతులకు గాయాలు కావడం ఇలా సమంతకు వరుస ఇబ్బందులు వచ్చాయి. అందుకే ప్రస్తుతం ఎండింగ్ దశలో ఉన్న సినిమాలను పూర్తిచేసి ఒక ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుందట సమంత. అందుకే ఇప్పటికే కొంత మంది నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్సును కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసిందని తెలుస్తోంది. 

‘శాకుంతలం’ షాక్ ‘ఖుషి’ పైనే ఆశలన్నీ..

సమంత రీసెంట్ గా నటించిన సినిమా ‘శాకుంతలం’. ఈ మూవీ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దీంతో సమంతకు పెద్ద షాక్ తగిలినట్టే అయింది. ఈ సినిమా ప్రభావం వలనే కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. అందుకే ఇప్పుడు విడుదల కాబోయే ‘ఖుషి’ సినిమా సమంతకు చాలా కీలకం. సమంత ఆశలన్నీ ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి. అటు విజయ్ దేవరకొండకు కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అత్యవసరం.

ఆచితూచి అడుగులు..

సమంత సినిమాలు మాత్రమే కాకుండా ‘ఫ్యామిలీ మెన్2’ లాంటి వెబ్ సిరీస్లలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం సమంతకు అంతగా కలసి రావడం లేదు. గతేడాది ‘యశోద’ సినిమాతో కాస్త పర్వాలేదనిపించినా తర్వాత ‘శాకుంతలం’ సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూసింది. దీంతో ఇప్పుడు కథల ఎంపిక విషయంలో దూకుడు తగ్గించిందట సామ్. ప్రస్తుతం ఉన్న సినిమాలు పూర్తి చేసి ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకూ ఓ ఏడాది విశ్రాంతి తీసుకోనుందట. కథల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోందట. దీంతో సామ్ అభిమానులు సమంత తర్వాత ఏ ప్రాజెక్ట్ ను ఓకే చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 

Also Read: నెల క్రితమే నిహారిక, చైతన్యకు విడాకులు - ఆలస్యంగా వెలుగులోకి!

Published at : 05 Jul 2023 10:26 AM (IST) Tags: Samantha Ruth Prabhu samantha movies khushi movie Samantha

ఇవి కూడా చూడండి

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?

చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?

‘సలార్’ రిలీజ్ డేట్ రూమర్స్, షారుక్, సల్మాన్‌లపై రామ్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సలార్’ రిలీజ్ డేట్ రూమర్స్, షారుక్, సల్మాన్‌లపై రామ్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!

మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

టాప్ స్టోరీస్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

YCP Counter To  Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు

YCP Counter To  Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు