Samantha: స్టేజ్‌పై సమంత కన్నీళ్లు - టాలీవుడ్ ఆడియన్స్ లవ్, ఎమోషన్‌కు ఫిదా
Samantha Ruth Prabhu: అమెరికాలో తానా సభల్లో హీరోయిన్ సమంత ఎమోషనల్ అయ్యారు. తెలుగు వారు తనపై చూపిస్తోన్న అభిమానానికి గర్వంగా ఉందన్న ఆమె... తనకు సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ చెప్పారు.

Samantha Emotional At Tana Conference: స్టార్ హీరోయిన్ సమంత ఎమోషనల్ అయ్యారు. తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తోన్న అభిమానానికి ఫిదా అవుతూ అంతర్జాతీయ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్నారు. అమెరికాలో జరిగిన 'తానా' వేడుకల్లో పాల్గొన్న ఆమె... స్పీచ్ ఇస్తూ మధ్యలో కంటతడి పెట్టారు.
ఎప్పుడూ... నా వెంటే ఉన్నారు
తన జీవితంలో ఎప్పుడు ఏం జరిగినా... ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తెలుగు వారు తన వెంటే ఉన్నారని సమంత ఎమోషనల్ అయ్యారు. 'తానా వేడుకల్లో పాల్గొనేందుకు నాకు 15 ఏళ్లు పట్టింది. ప్రతి ఏటా తానా, ఇక్కడ ఉన్న తెలుగు వారి గురించి వింటూనే ఉంటాను. నా ఫస్ట్ మూవీ 'ఏ మాయ చేశావే' నుంచి మీరు నాపై అమితమైన ప్రేమ చూపిస్తున్నారు. మీ లవ్, అభిమానానికి థాంక్స్ చెప్పడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది. నా జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీరు తోడుగా ఉన్నారు.
కెరీర్ పరంగా ప్రస్తుతం చాలా ముఖ్యమైన దశలో ఉన్నాను. 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి 'శుభం'తో ప్రొడ్యూసర్‌గా తొలి అడుగు వేశాను. ఈ మూవీని నార్త్ అమెరికాకు చెందిన తెలుగు వారు ఎంతగానో మెచ్చుకున్నారు. మంచి ఫలితాన్ని అందించారు. జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఏదైనా తప్పు చేసినా... మీరు ఎప్పుడూ నా వెంటే ఉన్నారు. అందుకు నేను చాలా గర్వపడుతున్నా. నేను ఏం చేసినా తెలుగు ఆడియన్స్ నన్ను చూసి గర్వపడతారా? లేదా? అనేదే ఆలోచిస్తాను. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు సపోర్ట్‌గా నిలిచినందుకు థాంక్స్. ప్రాంతాలను బట్టి నాకు దూరంగా ఉన్నా మీరు ఎప్పటికీ నా మనసులోనే ఉంటారు.' అంటూ ఎమోషనల్ అయ్యారు సమంత. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#SamanthaRuthPrabhu gets Emotional during her speech at #TANA Conference 2025.#TANA2025 pic.twitter.com/0u5NX85J7s
— Suryakantham🕊️ (@katthiteesukor1) July 6, 2025
Also Read: 'AIR' వెబ్ సిరీస్ కాంట్రవర్శీకి చెక్ - ఆ సీన్స్ డిలీట్... వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు
ఇక సినిమాల విషయానికొస్తే... సమంత 'శుభం' మూవీ సక్సెస్ తర్వాత ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఈ మూవీలో ఆమె ఓ స్పెషల్ రోల్ చేశారు. ఇటీవల ఆమె వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ... దీనికి సంబంధించిన ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అయ్యాయి. సమంత ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' సిరీస్ కోసం వర్క్ చేస్తున్నారు. అలాగే 'మా ఇంటి బంగారం' మూవీ కూడా చేస్తున్నారు. అయితే... దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు.
త్వరలోనే ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 'ఏ మాయ చేశావే' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత... ఆ తర్వాత వరుసగా హిట్ మూవీస్‌లో స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ఇటీవల 'శుభం' మూవీతో నిర్మాతగానూ సక్సెస్ అందుకున్నారు.






















