Salman Khan Films Fraud: సల్మాన్‌ఖాన్ ఫిలిమ్స్ పేరుతో ఫ్రాడ్, ఇలా మీరు మోసపోవద్దంటున్న సల్లు భాయ్
Salman Khan Films Fraud: సల్మాన్‌ఖాన్ ఫిలిమ్స్ పేరుతో కొంతమంది ఫ్రాడ్ చేస్తున్నారు. కాస్టింగ్ కాల్ అంటూ ఫేక్ పోస్టులు పెట్టడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
Fake Posts about Salman Khan Films: ఈజీ మనీకి అలవాటుపడిన చాలామంది తప్పు దారుల్లో డబ్బులు సంపాదించేందుకు తెగబడుతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ.. వాళ్ల అభిరుచులను, వాళ్ల అవసరాలను వాడుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ రోజుల్లో సైబర్ మోసం, ఫేక్ పోస్టులతో చేసే మోసాలు ఎక్కువ అయిపోతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పేరు మీద ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సెలబ్రిటీలు. తాము ఎప్పుడూ అలా అడగమని ముందుగానే అలెర్ట్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ పేరుతో కొంతమంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాటని నమ్మొద్దని సల్మాన్, ఆయన టీమ్ హెచ్చరిస్తున్నారు.
మోసపోకండి..
2011లో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. 'సల్మాన్‌ఖాన్ ఫిలిమ్స్' పేరుతో దాన్ని మొదలుపెట్టి ఎన్నో సినిమాలు తీశారు. అయితే, ఇప్పుడు ఆ ప్రొడక్షన్ హౌస్ పేరుతో కొత్త మోసానికి తెరలేపారు కొందరు కేటుగాళ్లు. ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేసినట్లుగా కాస్టింగ్ కాల్‌కి సంబంధించి కొన్ని పోస్టులుపెట్టారు. అయతే, ఆ పోస్ట్‌లు నిజం కాదని ఎలాంటి కాస్టింగ్ కాల్‌కి తమ ప్రొడక్షన్ హౌస్ నోటిఫికేషన్ ఇవ్వలేదని పొడ్రక్షన్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
లీగల్ యాక్షన్ తీసుకుంటాం..
ఇలాంటి ఫేక్ పోస్ట్‌లపై జాగ్రత్తగా ఉండాలని సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. "సల్మాన్‌ఖాన్, సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ ప్రస్తుతం ఏ సినిమాకి కూడా కాస్టింగ్‌కాల్ ఇవ్వలేదు. మేం ఎలాంటి ఏజెంట్స్‌ని కూడా నియమించుకోలేదు. అలాంటి ఈమెయిల్స్, మెసేజ్‌లను నమ్మకండి. అలా మోసం చేస్తున్న వాళ్లపై లీగల్‌గా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా మిస్టర్ ఖాన్ లేదా సల్మాన్‌ఖాన్ ఫిలిమ్స్ పేరును తప్పుగా వాడుకుంటే వాళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం" అని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇలానే పోయిన ఏడాది కూడా కొంతమంది ఫేక్ ఈమెయిల్స్ ఇస్తే.. అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చారు.
2011లో సల్మాన్‌ఖాన్ ఈ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ప్రారంభించారు. సల్మాన్‌ఖాన్ తల్లి సల్మా ఖాన్ కూడా దీంట్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే డబ్బులను మంచి పనులు, చారిటీకి ఉపయోగిస్తారు సల్మాన్ కుటుంబం. ఇక ఈ ప్రొడక్షన్‌లో వచ్చిన ఫస్ట్ సినిమా 'చిల్లర్ పార్టీ'ని నితీశ్ తివారీ, వికాశ్ భాల్ డైరెక్ట్ చేశారు.
సల్మాన్‌ఖాన్ చారిటీ విషయంలో చాలా ఉదారంగా ఉంటారు. ఎంతోమందికి హెల్ప్ చేశారు ఆయన. అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో సల్మాన్ ఎప్పుడూ ముందుంటారు. ఆ విధంగానే నాలుగేళ్ల వయసులో ఒక చిన్నారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు భాయ్‌జాన్. క్యాన్సర్‌ను జయించిన ఆ చిన్నారిని ఇంటికి పిలిపించుకుని మరీ మాట్లాడారు. అలా ఎన్నో మంచి పనులు చేశారు ఆయన.
వరుస సినిమాలు..
'చిల్లర్ పార్టీ' తర్వాత సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'భజరంగీ భాయ్‌జాన్', 'హీరో', 'ట్యూబ్‌లైట్', 'రేస్-౩', 'లవ్‌యాత్రి', 'నోట్‌బుక్', 'భరత్', 'కాగజ్', 'దబంగ్ ౩', 'రాధే', 'వికీకా భాయ్ కిసీకి జాన్' వంటి సినిమాలు తీశారు. ఇక సల్మాన్‌ఖాన్ నటించిన 'టైగర్ -౩' సినిమా ఈ మధ్యే రిలీజ్ అయ్యింది. కత్రీనా కైఫ్‌తో ఈ సినిమా తీశారు సల్మాన్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 466 కోట్ల రూపాయలు రాబట్టింది ఈ సినిమా.
Also Read: పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు చిరంజీవి సత్కారం