అన్వేషించండి

Salaar Movie: ‘సలార్’ పాన్ ఇండియా మూవీ కాదు, అంతకు మించి - ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త

Salaar Global Level: పోయిన ఏడాది చివర్లో రిలీజైన 'సలార్‌' మాత్రం బాక్సాఫీస్‌ దగ్గర బంపర్‌హిట్‌ నమోదు చేసింది. ప్రభాస్‌ ఫ్యాన్స్ మరోసారి కాలర్‌ ఎగరేసేలా చేసింది.

Salaar Global Level : యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌.. తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్‌ ఇండియా లెవెల్‌కి తీసుకెళ్లిన హీరో. 'బాహుబలి', 'బాహుబలి - 2' సినిమాలతో మన సినిమా రేంజ్‌ని బాలీవుడ్‌, అంతకుమించి తీసుకెళ్లాడు. ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు ఊహించినంత పెద్ద హిట్లు కాలేదు. కానీ, పోయిన ఏడాది చివర్లో రిలీజైన 'సలార్‌' మాత్రం బాక్సాఫీస్‌ దగ్గర బంపర్‌హిట్‌ నమోదు చేసింది. ప్రభాస్‌ ఫ్యాన్స్ మరోసారి కాలర్‌ ఎగరేసేలా చేసింది. ఇక ఇప్పుడు ఆ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే, బాక్సాఫీస్‌ దగ్గరే కాదు.. ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ప్రభాస్‌ 'సలార్‌' సినిమా. 'సలార్‌' పాన్‌ ఇండియా మాత్రమే కాదు.. అంతకుమించి అని గర్వంగా చెప్పుకునేలా చేస్తోంది. ఇక ఈ పోస్ట్‌ చూసిన ఫ్యాన్స్‌ అంతా.. ప్రభాస్‌ రేంజ్‌ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా అంటూ సోషల్‌మీడియా పోస్ట్‌ను తెగ వైరల్‌ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

అరుదైన రికార్డ్‌.. 

2023, డిసెంబర్‌ 22న థియేటర్లలో రిలీజైన ‘సలార్‌’ బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక ఆ తర్వాత.. జనవరి 20న ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘సలార్‌’ సినిమా అరుదైన రికార్డ్‌ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌ అవుతున్న సినిమాల్లో టాప్‌-10లో నిలిచిన నాన్- ఇంగ్లీష్ చిత్రంగా రికార్డ్‌ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా మేకర్సే సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇక నుంచి 'సలార్‌' పాన్‌ఇండియా సినిమా కాదు.. గ్లోబల్‌ సినిమాగా మారిపోయింది అని చెప్పారు. ఇక ఈ సినిమాని త్వరలోనే ఇంగ్లీష్‌ భాషలో కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది హొంబలే సినిమా. ఇక ఓటీటీలో తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతుండగా.. హిందీలో మాత్రం ఇంకా రిలీజ్‌ కాలేదు. సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే హిందీలో రిలీజ్‌ చేయాలనే రూల్‌ ఉన్న నేపథ్యంలో ఇంకా రిలీజ్‌ కాలేదు.

కేజీఎఫ్‌ - 1, 2తో భారీ హిట్లు అందించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ 'సలార్‌'ని తెరకెక్కించారు. డిసెంబర్‌ 22న రిలీజైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. స్నేహితుడికి ఇచ్చిన మాటకోసం ప్రభాస్‌ చేసే పోరాటం, ఆయన యాక్షన్‌, ప్రతి సీన్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడిగా ప్రధాన పాత్ర చేశారు. ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి భువన గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సలార్‌కి సీక్వెల్‌ కూడా ఉన్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో 'సలార్‌ -2' ఏ రేంజ్‌లో ఉండబోతుందో అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Also Read: ‘జై హనుమాన్‌’లో భల్లాల దేవుడు? ‘హను మాన్’లో ఆంజనేయుడి కళ్లు ఆయనవేనట!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget