News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Salaar: ‘సలార్’ టీమ్ విజువల్ ట్రీట్ - ఆ ఫార్మాట్‌లో మూవీ రిలీజ్‌కు సన్నహాలు, ఫ్యాన్స్‌కు పండగే!

ప్రభాస్ ఒక సినిమాకు మించి మరొకటి విడుదల అవుతూనే ఉన్నాయి. తాజాగా ‘సలార్’ విషయంలో కూడా విడుదల మామూలుగా ఉండకూడదు అనుకొని మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత ప్రభాస్‌కు సరైన హిట్ లేకపోయినా కూడా ప్రేక్షకుల్లో తన ఫ్యాన్ ఫాలోయింగ్, మేకర్స్ తనపై పెడుతున్న ఖర్చు.. ఏ మాత్రం తగ్గలేదు. అందుకే ప్రభాస్ ఒక సినిమాకు మించి మరొకటి విడుదల అవుతూనే ఉన్నాయి. తాజాగా ‘సలార్’ విషయంలో కూడా విడుదల మామూలుగా ఉండకూడదు అనుకొని మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో..
‘సలార్’ను ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ‘సలార్’ అమెరికన్ డిస్ట్రిబ్యూటర్లు బయటపెట్టారు. ఇక త్వరలోనే ఐమ్యాక్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయని తెలిపారు. అమెరికన్ డిస్ట్రిబ్యూటర్లు అంత ఓపెన్‌గా అనౌన్స్ చేసినా కూడా ఇండియాలో మాత్రం దీని మీద కామెంట్ చేయడానికి మేకర్స్ ముందుకు రాలేదు. ఒకవేళ ఐమ్యాక్స్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే.. మూవీ క్వాలిటీ కచ్చితంగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ‘సలార్’ రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా.. ఐమ్యాక్స్ ఫార్మాట్ అనేది మూవీకి మరింత హైప్ క్రియేట్ చేసే అంశమని అనుకుంటున్నారు.

ఒకటి తర్వాత మరొకటి..
ప్రభాస్‌కు ‘బాహుబలి’ తర్వాత చెప్పుకోవడానికి ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు. ఆ చిత్రం తర్వాత తను చేసిన మూడు సినిమాలు నిర్మాతలకు ఎంతోకొంత నష్టాన్నే మిగిల్చాయి. ముందుగా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. దర్శకుడు సుజీత్ ‘సాహో’ను తెరకెక్కించిన విధానాన్ని, అందులో ప్రభాస్ గ్రేస్‌ను ప్రేక్షకులు ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. కానీ విడుదల అయినప్పుడు మాత్రం దీనిపై చాలా నెగిటివ్ కామెంట్స్ చేసి ఫ్లాప్ చేశారు. ఆ తర్వాత వచ్చిన ‘రాధే శ్యామ్’ పూర్తిస్థాయి లవ్ స్టోరీ అని ప్రేక్షకులకు ఏ మాత్రం హింట్ లేదు. దీంతో ప్రస్తుతం ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు ఆ కథ సెట్ అవ్వలేదని ‘రాధే శ్యామ్’ను కూడా ఫ్లాప్ చేశారు. ఇక చాలాకాలం తర్వాత వెండితెరపై రామాయాణాన్ని చూపిస్తామంటూ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో చేతులు కలిపాడు ప్రభాస్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆదిపురుష్’ హిట్ అవ్వకపోగా ఎన్నో కాంట్రవర్సీలను మూటగట్టుకుంది. అయినా కూడా తన అప్‌కమింగ్ సినిమాలు అయిన ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’లను తెరకెక్కించడానికి ఎంత భారీ బడ్జెట్ ఖర్చు పెట్టడానికి అయినా మేకర్స్ ముందుకొస్తున్నారు.

పవర్‌ఫుల్‌గా ‘సలార్’ టీమ్..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అప్‌కమింగ్ చిత్రాల్లో ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తోంది ‘సలార్’ కోసమే. అందుకే ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దీనిని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలయిన గ్లింప్స్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ప్రభాస్ లాంటి కట్అవుట్‌కు ఇలాంటి సినిమానే కరెక్ట్ అని అనుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇందులో ప్రభాస్ సరసన జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: విజయ్ సీక్రెట్ గర్ల్‌ ఫ్రెండ్ గురించి లీక్ చేసిన సమంత, ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 18 Aug 2023 09:15 AM (IST) Tags: Salaar Shruti Haasan Prabhas imax Prashanth Neel

ఇవి కూడా చూడండి

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Urfi Javed Instagram Account: బిగ్ బాస్ బ్యూటీకి ఇన్ స్టా షాక్, అకౌంట్ ను సస్పెండ్, కానీ..

Urfi Javed Instagram Account: బిగ్ బాస్ బ్యూటీకి ఇన్ స్టా షాక్, అకౌంట్ ను సస్పెండ్, కానీ..

Animal Day 2 Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘యానిమల్‘, రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూళు చేసిందంటే?

Animal Day 2 Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘యానిమల్‘, రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూళు చేసిందంటే?

Shalini Pandey: తెలుగు సినిమాల కోసం ఎదురుచూపు - మనసులో మాట చెప్పేసిన అర్జున్ రెడ్డి బ్యూటీ

Shalini Pandey: తెలుగు సినిమాల కోసం ఎదురుచూపు - మనసులో మాట చెప్పేసిన అర్జున్ రెడ్డి బ్యూటీ

Salaar Trailer : యూట్యూబ్‌లో దుమ్ములేపిన 'సలార్' ట్రైలర్ - 'KGF2' తో పాటూ అన్ని రికార్డులు బద్దలు!

Salaar Trailer : యూట్యూబ్‌లో దుమ్ములేపిన 'సలార్' ట్రైలర్ - 'KGF2' తో పాటూ అన్ని రికార్డులు బద్దలు!

టాప్ స్టోరీస్

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Mrunal Thakur Photos : హాయ్ మృణాల్... మరీ అంత ముద్దొస్తే ఎలా?

Mrunal Thakur Photos : హాయ్ మృణాల్... మరీ అంత ముద్దొస్తే ఎలా?
×