అన్వేషించండి

Salaar 2: 'రాజా సాబ్' ఫ్లాప్ తర్వాత 'సలార్ 2' పక్కన పెట్టేశారా? ప్రభాస్ నిర్మాతల రియాక్షన్ ఏమిటంటే?

Salaar 2 Update: భారీ అంచనాల నడుమ విడుదలైన 'ది రాజా సాబ్' బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. దాంతో 'సలార్ 2' పక్కన పెట్టేశారని పుకార్లు షికార్లు చేశాయి. వాటిపై ప్రభాస్ నిర్మాతలు రియాక్ట్ అయ్యారు.

సంక్రాంతి బరిలో భారీ అంచనాల నడుమ 'ది రాజా సాబ్' రిలీజ్ అయ్యింది. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల్లో కొందరిని, ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. దాంతో 'సలార్ 2' పక్కన పెట్టేశారని పుకార్లు షికార్లు చేశాయి. 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ రిజల్ట్‌ తర్వాత సోషల్ మీడియాలో 'సలార్ 2' గురించి ఒక్కసారిగా ఊహాగానాలు మొదలు అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని కామెంట్స్‌ చేశారు. వాటిపై ప్రభాస్ నిర్మాతలు రియాక్ట్ అయ్యారు.

'ది రాజా సాబ్' తర్వాత ప్రభాస్ కెరీర్‌పై ప్రశ్నలు
నిజానికి... 'ది రాజా సాబ్' సరిగ్గా ఆడకపోవడంతో ప్రభాస్ కెరీర్ గురించి రకరకాల చర్చలు మొదలు అయ్యాయి. అదే సమయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న ఆయన సినిమా 'స్పిరిట్' విడుదల తేదీని (మార్చి 5, 2027) ప్రకటించారు. దాంతో 'సలార్ 2'పై సందేహాలు మొదలు అయ్యాయి.

Also ReadOm Shanti Shanti Shantihi Twitter Review - 'ఓం శాంతి శాంతి శాంతిః' ట్విట్టర్ రివ్యూ: ప్రీమియర్ టాకేంటి? తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బా సినిమా హిట్టేనా?

'సలార్ 2' ఆగలేదు... పుకార్లకు నిర్మాతల బ్రేక్!
ఇటీవల 'సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్' సీక్వెల్‌ను 'ది రాజా సాబ్' వైఫల్యం తర్వాత నిలిపివేశారని కొందరు పేర్కొన్నారు. ఈ సినిమా కొంత కాలం పాటు వాయిదా పడవచ్చన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఆ సినిమాను పక్కన పెట్టి, పూర్తిగా కొత్త సినిమా చేయాలని ఆలోచిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు నిర్మాతలు ఆ పుకార్లు అన్నిటికీ తెర దించారు. 'సలార్ 2' గురించి వస్తున్న వార్తలను తప్పు అని చెబుతూ... చిత్ర బృందం తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది. అది నటి శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా పోస్ట్ చేశారు. అందులో ఆమె ప్రభాస్‌తో కలిసి కనిపించింది. ఇద్దరూ మొబైల్‌లో ఏదో చూస్తూ నవ్వుతూ కనిపించారు. దాంతో అభిమానులకు ఉత్సాహం వచ్చింది. 'సలార్ 2' ట్రాక్‌లో ఉందని అర్థం అయ్యింది.

Also ReadBorder 2 Collection: చిరంజీవి సినిమా వసూళ్ళను దాటబోతున్న 'బోర్డర్ 2'... ప్రస్తుతానికి 2026లో బిగ్గెస్ట్ హిట్ సన్నీ డియోల్‌దే

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Salaar (@salaarthesaga)

'సలార్' గురించి చెప్పాలంటే... 'సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్'కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారడం అనేది కథ. డిసెంబర్ 2023లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 650 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాలో శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి కూడా నటించారు. ఇప్పుడు 'సలార్ 2: శౌర్యాంగ పర్వం' మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే మొదలు కానుంది.

Also ReadPoliticians Died In Flight Crash: తెలుగు నేతల్లో వైయస్సార్, బాలయోగి... విమాన ప్రమాదాల్లో మరణించిన జాతీయ రాజకీయ ప్రముఖులు ఎవరంటే?

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget