Saif Comments on Adipurush: ఎట్టకేలకు 'ఆదిపురుష్' రిజల్ట్‌పై స్పందించిన సైఫ్ అలీ ఖాన్ - ఏమన్నాడంటే..
Saif Ali Khan: మూవీకి వచ్చిన నెగిటివిటీ కారణంగా హీరో నుంచి ప్రధాన పాత్రలు ఏవీ బయటకు వచ్చి మాట్లాడలేదు. అయితే మూవీ రిలీజైన ఏడు నెలలకు తాజాగా సైఫ్ అలీఖాన్ 'ఆదిపురుష్' రిజల్ట్‌పై స్పందించాడు.
Saif Ali Khan Comments: గతేడాది రిలీజైన 'ఆదిపురుష్' సినిమాను ఎవరూ మరిచిపోరు. ప్రభాస్‌ను రాముడిగా చూపిస్తున్నానంటూ డైరెక్టర్ ఓంరౌత్ మూవీపై హైప్ క్రియేట్ చేశాడు. ఆరడుగుల ఆజానుబాహుడైన ప్రభాస్‌ను.. రాముడి పాత్రలో ఊహించుకుని ఫ్యాన్స్ అంతా మురిసిపోయారు. ఇతీహాసం నేపథ్యం కావడంతో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఇక రావణుడుగా సైఫ్ అలీఖాన్ అని, సీత క్రతి సనన్ తీసుకోవడంతో ఆదిపురుష్ కంప్లీట్ రామయణంగా రాబోతుందంటూ అంతా ఈగర్‌గా వేయిట్ చేశారు. ఇక టీజర్ రిలీజ్‌తో మొదలైంది ఈ మూవీ వివాదం. రామాయణం అని ఓ కార్టున్ మూవీ చూపించాడని, మన ఇతిహాసాలా దేవతమూర్తులను కించపరిచాడంటూ ఓంరౌత్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఆ వ్యాఖ్యలతో మరింత ముదిరిన వివాదం
పాన్ ఇండియాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అంతా బడ్జెట్ పెట్టిన మూవీలో గ్రాఫిక్స్ విజువల్స్, పాత్రలను రూపుదిద్దంలో ఓంరౌత్ ఫెయిల్ అయ్యాడంటూ అతడిపై విమర్శలు గుప్పించారు. ఈ మూవీ విడుదలై దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది.. ఇప్పటికీ డైరెక్టర్ ఓంరౌత్‌ను తిట్టిపోస్తూనే ఉన్నారు సినీ ప్రియులు. అంతగా ఆదిపురుష్‌లో హర్ట్ చేశాడు ఓంరౌత్. ఇంతగా నెగిటివిటీ వచ్చినా మూవీ టీం మాత్రం ఎప్పుడు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. పైగా తాను చదివిన రామాయణం ఇలాగే ఉందని, అసలు 'ఆదిపురుష్' రామాయణమే కాదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు మూవీ రైటర్ మనోజ్ ముంతాషిర్. అప్పట్లో ఆయన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మూవీకి వచ్చిన నెగిటివిటీ కారణంగా హీరో నుంచి ప్రధాన పాత్రలు ఏవీ బయటకు వచ్చి మాట్లాడలేదు.
నేేనేప్పుడు స్టార్ అని ఫీలవ్వను: సైఫ్
అయితే మూవీ రిలీజైన ఏడు నెలలకు తాజాగా సైఫ్ అలీఖాన్ 'ఆదిపురుష్' రిజల్ట్‌పై స్పందించాడు. నిజానికి ఆదిపురుష్ ఫస్ట్ ట్రోల్‌కు గురైంది లంకేశ్వరుడు రావణుడు పాత్రలే. దీనిపై ఎప్పుడు స్పందించని సైఫ్ తాజాగా దీనిపై పెదవిప్పడం ఆసక్తిని సంతరించుకుంది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో సైఫ్ మాట్లాడాడు. ఈ సందర్భంగా స్టార్ ఇమేజ్‌పై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. "ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలని నా తల్లిదండ్రులను చూసి నేర్చుకున్నాను. నా పేరెంట్స్ పెద్ద స్టార్స్ అయినా.. వాళ్లేప్పుడు సింప్లిసిటీకే ప్రాధాన్యత ఇచ్చారు. స్టార్స్ అన్న గర్వం వారిలో ఎప్పుడూ కనిపించలేదు. నేను కూడా రియాలిటీలోనే బతుకాతాను. నన్ను నేను స్టార్ అని ఎప్పుడు ఫీల్ అవ్వను. అలాంటప్పుడే ఏ సందర్భాన్ని అయినా ఫేస్ చేయగలం. అందుకే నేను ఎప్పుడూ రియాలిటీకి దగ్గరగా ఉంటాను" అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: పెళ్లి పేరుతో టాలీవుడ్ మహిళా నిర్మాత మోసం - పోలీసులను ఆశ్రయించిన కెమెరామెన్
అనంతరం మాట్లాడుతూ.. తన మూవీ ప్లాప్స్‌పై స్పందించాడు. ఓటమి గురించి నేనేప్పుడు భయపడను. దానికి ఆదిపురుష్ సినిమాఏ ఇందుకు ఉదాహణగా తీసుకుందాం. కొన్నిసార్లు రిస్క్ కూడా చేయాలి. జీవితం అన్నాక అన్ని ఉండాలి. ఓటమి వచ్చిందని మన ప్రయత్నాన్ని వదిలేయకుడదు. ఏలాంటి పరిస్థితులనైనా ఒకేలా తీసుకుని ముందుకు పోతూనే ఉండాలి. మన వంతు కష్టపడాలి. ఆదిపురుష్ మూవీ దురదృష్టం కొద్దీ వర్కౌట్ కాలేదు. తర్వాత సినిమా చూసుకుందామనే ధైర్యంతో కెరీర్ పరంగా ముందుకు సాగాలి" అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం సైఫ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియాలో మూవీలో సైఫ్ విలన్‌గా నటిస్తున్నాడు.