OG Celebrations: పవన్ 'OG' సెలబ్రేషన్స్ - ఈలలు, కేకలతో మెగా హీరోల సందడి... సాయిదుర్గా తేజ్ To అకీరా వరకూ...
Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'OG' సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

Pawan Kalyan's OG Movie Celebrations: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండుగ వచ్చేసింది. పవన్ కల్యాణ్ అవెయిటెడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా 'OG' బుధవారం రాత్రి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతం వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో 'ఓజీ' సంబరాలు అంబరాన్నంటగా బుధవారం సెలబ్రేషన్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. థియేటర్ల వద్ద ఫ్యాన్స్‌తో పాటు మెగా హీరోలు, సెలబ్రిటీలు సందడి చేశారు.
ఈలలు, కేకలతో మెగా హీరోల సందడి
పవన్ భారీ యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్స్ అదిరిపోయాయంటూ మెగా హీరోలు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సంబరాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరోస్ వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, పవన్ వీరాభిమాని స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైదరాబాద్ శ్రీరాములు థియేటర్ వద్ద సందడి చేశారు. పవన్ భారీ యాక్షన్ సీన్స్ వచ్చిన టైంలో లేచి మరీ పేపర్లు విసురుతూ ఈలలు, కేకలు వేస్తూ ఫ్యాన్స్‌లో మరింత జోష్ పెంచారు.
వీరితో పాటు పవన్ కుమారుడు అకీరా, కుమార్తె ఆద్య కూడా థియేటర్లలో సందడి చేశారు. కామనర్స్‌లా తన తండ్రి మూవీని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Director Harish Shankar watches his favorite hero’s film #OG along with the heroes he worked with!
— idlebrain jeevi (@idlebrainjeevi) September 24, 2025
Varun Tej & Sai Durgha Tej pic.twitter.com/mq2j2GJpIM
#Aadhya papa & #AkiraNandan spotted at #OG premiers in Vimal cinemas ❤️🔥🔥@thechordfather #TheyCallHimOG #PawanKalyan pic.twitter.com/t3lAELohm5
— Lord Shiv🥛 (@lordshivom) September 24, 2025
Also Read: 'ఓజీ' రివ్యూ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా? సినిమా హిట్టా? ఫట్టా?
మూవీని చూసిన హీరోలు, సెలబ్రిటీలు నెట్టింట రివ్యూస్ రాస్తూ సందడి చేస్తున్నారు. 'ఓజీ' మూవీ బ్లాక్ బస్టర్ అంటూ నేచరల్ స్టార్ నాని కామెంట్ చేశారు. అటు డైరెక్టర్ బాబీ... ఎన్నో రోజులుగా ఎదురూచూస్తోన్న ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూశానంటూ రాసుకొచ్చారు. 'పవర్ స్టార్ ఓ అద్భుతం. సుజీత్, తమన్‌ల గురించి మాటల్లో చెప్పలేను. ఓజీ పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్.' అంటూ తెలిపారు.
ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో...
పవన్ కల్యాణ్... ఈ పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. పవర్ స్టార్ పేరుకు తగ్గట్లుగానే పవర్ ఫుల్ రోల్‌లో కనిపించి చాలా కాలమైంది. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన స్టైల్, మాస్ యాక్షన్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. వాళ్ల వెయిటింగ్ చెక్ పెట్టేలా డైరెక్టర్ సుజీత్ 'OG' ఫుల్ ట్రీట్ ఇచ్చారు. భారీ మాస్ యాక్షన్ మూవీలో ఆయన ఎలివేషన్స్ అదిరిపోయాయి. పవన్ అభిమానిగా ఆయన్ను ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలానే సిల్వర్ స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు. వెపన్స్, గన్స్, కత్తులతో గ్యాంగ్ స్టర్స్‌ను పవన్ వేటాడడం నిజంగా వేరే లెవల్‌లో ఉంది. స్టైల్, గ్రేస్, జోష్ అదిరిపోయాయి. పవన్ కెరీర్‌లో 'OG' గుర్తుండిపోతుంది.






















