Kantara Chapter 1 Premiere Reviews: 'కాంతార' ఫస్ట్ షో డీటెయిల్స్... రిషబ్ శెట్టి సినిమా పెయిడ్ ప్రీమియర్స్, ట్విట్టర్ రివ్యూస్ వచ్చేది ఎప్పుడంటే?
Kantara Paid Premiere Shows: రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1'కు పాన్ ఇండియా లెవల్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇండియాలో, అమెరికాలో ఈ సినిమా ఫస్ట్ షో ఎన్ని గంటలకు పడింది? ట్విట్టర్ రివ్యూస్ వచ్చేది ఎప్పుడంటే?

Rishab Shetty's Kantara Chapter 1 Movie First Show, Paid Premiere Show Report: రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తాజా సినిమా 'కాంతార చాప్టర్ 1'. పాన్ ఇండియన్ స్థాయిలో విజయం సాధించిన 'కాంతార'కు ప్రీక్వెల్ ఇది. గ్రాండియర్ విజువల్స్‌తో కూడిన సినిమా ట్రైలర్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. మరి, ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లు ఏ టైంకి షెడ్యూల్ అయ్యాయి? ఏ భాషలో ఎన్ని గంటలకు షోస్ ఉన్నాయి? పెయిడ్ ప్రీమియర్లు ఎప్పుడు? ఆ షోస్ రిపోర్ట్, ట్విట్టర్ రివ్యూస్ ఎన్ని గంటలకు వస్తాయి? అనేది చూస్తే...
బెంగళూరులో మొదటి ప్రీమియర్...
సాయంత్రం నుంచి 'కాంతార' సందడి!
Kantara Chapter 1 First Paid Premiere Show: 'కాంతార ఏ లెజెండ్' ఫస్ట్ పెయిడ్ ప్రీమియర్ షో బెంగళూరులో ప్రదర్శించనున్నారు. ఈ రోజు (అక్టోబర్ 1వ తేదీ) సాయంత్రం ఐదు గంటలకు బెంగళూరులో మొదటి పెయిడ్ ప్రీమియర్ షో షెడ్యూల్ అయ్యింది. బెంగళూరు సిటీ అంతటా సుమారు వంద షోస్ వరకు ప్లాన్ చేశారు.
'కాంతార చాప్టర్ 1'కు పాన్ ఇండియా లెవల్ క్రేజ్ ఉన్నప్పటికీ... అది కన్నడ ఫిల్మ్. కన్నడలో పేరున్న హీరో, నిర్మాతలు చేసిన సినిమా. అంతకంటే ఎక్కువగా కన్నడ సంప్రదాయం, అక్కడ దేవతలపై చేసిన సినిమా. అందుకని, వాళ్లకు ఓ నేటివ్ టచ్ ఉంటుంది. అక్కడ ఎక్కువ షోస్ పడుతున్నాయి. హైదరాబాద్ సిటీలో 'కాంతార' తెలుగు వెర్షన్ ఫస్ట్ ప్రీమియర్ షో ఏడున్నర గంటల తర్వాత, చెన్నైలో తమిళ వెర్షన్ షోస్ పది గంటలకు పడుతున్నాయి. అమెరికా కంటే ముందుగా ఇండియాలో ప్రీమియర్లు షెడ్యూల్ చేశారు.
'కాంతార చాప్టర్ 1' ప్రీమియర్స్ రిపోర్ట్స్...
ట్విట్టర్ రివ్యూస్ వచ్చేది ఎన్ని గంటలకు?
Kantara Chapter 1 Runtime: 'కాంతార చాప్టర్ 1' రన్ టైమ్ 2.48 నిమిషాలు. అంటే సుమారు మూడు గంటలు. ఇంటర్వెల్ 15 నిమిషాలు యాడ్ చేసుకున్నా... మూవీ కంప్లీట్ అయ్యేసరికి మూడు గంటల 15 నిమిషాలు అవుతుంది. సో... బెంగళూరులో ఐదు గంటలకు మొదటి షో పడుతుంది కనుక, కంప్లీట్ రిపోర్ట్ & ట్విట్టర్ రివ్యూస్, క్రిటిక్స్ రివ్యూస్ తొమ్మిది గంటలకు వచ్చేస్తాయి. అక్టోబర్ 2వ తేదీన ఉదయం ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల అయ్యేసరికి సౌత్ ఇండియన్ క్రిటిక్స్ నుంచి రివ్యూలు వస్తాయి. హిందీలో మాత్రం పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించడం లేదు. అక్కడ మీడియాకు స్పెషల్ షో ప్లాన్ చేసినట్టు తెలిసింది.
Also Read: 'కాంతార' vs 'ఇడ్లీ కొట్టు'... తెలుగులో ఎవరికి క్రేజ్ ఎక్కువ? ఎవరిది అప్పర్ హ్యాండ్??
'కాంతార' చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఈ ప్రీక్వెల్ 'కాంతార చాప్టర్ 1' కూడా నిర్మించారు. రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ నటించిన ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్, హిందీ నటుడు గుల్షన్ దేవయ్య తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. మరి, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా? ఫస్ట్ పార్ట్ రేంజ్ సక్సెస్ రిపీట్ చేస్తుందా? అనేది చూడాలి.





















