Kantara Chapter 1 Collections: 500 కోట్ల క్లబ్‌లో 'కాంతార చాప్టర్ 1' - వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Kantara Chapter 1 First Week Collections: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ వీక్ రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. 500 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు మేకర్స్ వెల్లడించారు.

Rishab Shetty's Kantara Chapter 1 First Week Collections: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ నెల 2 నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే నుంచే హిట్ టాక్‌తో కాసుల వర్షం కురుస్తోంది. అటు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు సాధించింది. కన్నడ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఘనత సాధించింది. తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
వారం రోజుల్లోనే...
4 రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన 'కాంతార చాప్టర్ 1' వారం రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్‌గా రూ.509.25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది. 'బాక్సాఫీస్ వద్ద డివైన్ బ్లాక్ బస్టర్ దూసుకుపోతోంది. ఫస్ట్ వీక్ ప్రపంచవ్యాప్తంగా రూ.509.25 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
View this post on Instagram
Also Read: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... టీవీల్లోనూ వచ్చేస్తోంది
2022లో వచ్చిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన 'కాంతార చాప్టర్ 1' ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు అనుగుణంగానే 9 రోజుల్లోనే రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. రూ.600 కోట్లతో 'ఛావా' అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలవగా.... త్వరలోనే 'కాంతార 1' ఫస్ట్ ప్లేస్‌లోకి వెళ్తుందని ఫ్యాన్స్‌తో పాటు మూవీ టీం కూడా భావిస్తోంది. ఇప్పటికీ ఓవర్సీస్‌లోనూ ఫుల్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ రన్ అవుతుండగా... తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్లలోనూ దూసుకెళ్తోంది. ఇక కన్నడ చిత్రాల్లో ఈ మూవీ కలెక్షన్లలో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 నిలిచింది.
ఈ మూవీలో రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. రిషబ్ హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. జయరాం, ప్రమోద్ శెట్టి, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. మూవీ ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల టీం ఆనందం వ్యక్తం చేస్తోంది. హీరో రిషబ్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారారు. 'ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంటెండ్ దర్శకులు ఉన్నారు. అందరితో పోలిస్తే నేను చాలా చిన్నవాడిని. ఎందరో ప్రముఖులు కాంతార చాప్టర్ 1పై ప్రశంసలు కురిపిస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయం నాపై మరింత బాధ్యతను పెంచింది.' అంటూ చెప్పారు. 'కాంతార' దైవ భూమి రహస్యాలు, పంజుర్లి, గుళిగతో పాటు ఈశ్వరుని దైవ గణాలను మూవీలో ఎంతో అద్భుతంగా చూపించారు.





















