Retro: 'రెట్రో' మూవీ టీం గొప్ప మనసు - అగరం ఫౌండేషన్‌కు రూ.10 కోట్ల విరాళం
Retro Team Donation: 'రెట్రో' మూవీ టీం గొప్ప మనసు చాటుకుంది. మూవీ కలెక్షన్ల నుంచి రూ.10 కోట్ల విరాళాన్ని అగరం ఫౌండేషన్‌కు అందజేసింది. దీంతో ఫ్యాన్స్ సూర్యను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Suriya's Retro Movie Team Donation To Agaram Foundation: తమిళ స్టార్ సూర్య (Suriya) లేటెస్ట్ మూవీ 'రెట్రో' (Retro). ఈ మూవీ టీం గొప్ప మనసు చాటుకుంది. సినిమా కలెక్షన్లలో నుంచి అగరం ఫౌండేషన్‌కు రూ.10 కోట్ల విరాళం ఇచ్చింది. ఈ మేరకు ఫౌండేషన్ సభ్యులకు సూర్య, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు చెక్ అందించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సూర్య గొప్ప మనసును ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎవరిదీ అగరం ఫౌండేషన్!
పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య, ఉద్యోగ నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా సూర్య 2006లో ఈ అగరం ఫౌండేషన్ స్థాపించారు. అప్పటి నుంచి పేద పిల్లలు చదువు, గ్రామీణ ప్రజల ఆర్థిక భద్రత కోసం సాయం చేస్తూ వస్తున్నారు. తాజాగా తన లేటెస్ట్ మూవీ 'రెట్రో' కలెక్షన్ల నుంచి భారీగా విరాళం అందించారు.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకోగా తెలుగులో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. తాజాగా ఈ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.104 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీం ఓ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Also Read: హారర్ నుంచి రొమాంటిక్ కామెడీ వరకూ.. - ఒకే రోజు ఓటీటీల్లోకి 9 సినిమాలు
2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య స్వయంగా ఈ మూవీని నిర్మించగా.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. రొమాన్స్, మాస్ యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'రెట్రో' సినిమాకు రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్) సహా నిర్మాతలు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా తమిళంలో మంచి కలెక్షన్లు రాబట్టగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక మాత్రం ఆశించినంత ఫలితం సాధించలేకపోయింది.
స్టోరీ ఏంటంటే?
పారి అలియాస్ పారివేల్ కణ్ణన్ (సూర్య) ఓ అనాథ. మాఫియా వ్యవహారాలు, గ్యాంగ్ స్టర్‌గా ఉన్న తిలక్ (జోజు జార్జ్) దగ్గర అతని తండ్రి పని చేస్తాడు. ఓసారి తిలక్ ఇంటి మీది జరిగిన దాడిలో పారి తండ్రి చనిపోతాడు. ఆ టైంలో పారిని తన కన్న కొడుకుగా పెంచుతుంది తిలక్ భార్య. తొలుత పారిని కొడుకుగా యాక్సెప్ట్ చేయని తిలక్.. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల యాక్సెప్ట్ చేస్తాడు.
రుక్మిణి (పూజా హెగ్డే)తో ప్రేమలో పడిన పారి... ఆమెతో పెళ్లి తర్వాత గ్యాంగ్‌స్టర్, రౌడీ పనులకు ముగింపు పలికి, అన్నింటికీ దూరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటాడు. అయితే... పెళ్లికి ముందు చేసిన ఒక 'గోల్డెన్ ఫిష్' డీల్ వల్ల తిలక్ - పారి మధ్య వైరం ఏర్పడుతుంది. దీంతో పెళ్లిలో గొడవ జరగ్గా.. పారికి కన్మణి దూరంగా వెళ్తుంది. మళ్లీ పారి, కన్మణి కలిశారా?, పారి ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? అండమాన్ దీవుల్లో ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.






















