Prabhas Birthday Special : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రెబల్ స్టార్ కెరీర్లో టాప్ 10 స్క్రీన్ లుక్స్ ఇవే, కటౌట్ చూస్తే మతి పోవాల్సిందే
Rebel Star Prabhas Looks : రెబల్ స్టార్ ప్రభాస్ తన స్క్రీన్ లుక్స్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటివరకు అతని కెరీర్లో బెస్ట్ స్క్రీన్ లుక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Prabhas Best Screen Looks : అందగాడు.. అందరివాడు.. అందుబాటు బంధువు వీడు.. ప్రభాస్‌కి యాప్ట్ లిరిక్స్ ఇవి. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్సే కాదు.. అందరి ఫ్యాన్స్‌కి ఇష్టమైన వ్యక్తి ఈ రెబల్ స్టార్. అంతేనా హీరోలు, హీరోయిన్లు కూడా ఎన్నోసార్లు ప్రభాస్‌పై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. అతని మంచితనానికి, ప్రేమకి పాన్ ఇండియా లెవెల్లో ఎందరో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే అతని లుక్స్‌కి కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.
ఈశ్వర్ నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలోనూ ప్రభాస్ కొత్త లుక్స్‌తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. ఏమున్నాడ్రా బాబు.. అనే రేంజ్లో తన లుక్స్ మారుస్తూ ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇస్తున్నాడు ఈ రెబల్ స్టార్. మరి ప్రభాస్ కెరీర్లో టాప్ 10 స్క్రీన్ లుక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
వర్షం (2004)
ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాల్లో అందంగా కనిపించినా.. మొదటిసారి లవర్‌బాయ్‌గా కనిపించిన వర్షం లుక్స్‌కి అప్పట్లో చాలామంది ఫిదా అయ్యారు.
ఛత్రపతి (2005)
ప్రభాస్‌కి రెబల్ లుక్ ఇచ్చిన మూవీగా ఛత్రపతి చెప్పొచ్చు. యాక్షన్ హీరో లుక్‌లో ప్రభాస్ మూవీకే హైలెట్‌గా నిలిచాయి.
బిల్లా (2009)
బిల్లా ప్రభాస్ డార్క్, గ్యాంగ్‌స్టర్ లుక్‌లో స్టైలిష్‌గా ఆకట్టుకున్నాడు. డ్యూయల్ రోల్లో.. స్టైలిష్, క్రోకెడ్ లుక్‌తో అలరించారు.
మిస్టర్ పర్ఫెక్ట్ (2011)
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ సాఫ్ట్ రొమాంటిక్ హిరోగా కనిపించాడు. ఈ సినిమాలో ఫ్యాషన్ ఫార్వార్డ్ లుక్‌లో కొత్తగా కనిపించారు.
మిర్చి (2013)
ప్రభాస్ బెస్ట్ స్టైలిష్ లుక్‌లో ఈ సినిమాలో కనిపించాడు. అబ్రాడ్ లుక్‌కి, ఇండియా లుక్‌కి చాలా డిఫరెన్స్ చూపించాడు.
బాహుబలి (2015)
ఈ సినిమాలో రాజుగా కనిపించిన ప్రభాస్‌ని చూస్తే నిజంగానే కింగ్ అనుకుంటారు.
సాహో (2019)
ప్రభాస్ మోస్ట్ స్టైలిష్ లుక్‌లో కనిపించిన చిత్రం సాహో. మునుపెన్నడూ చూడని విధంగా కనిపించారు.
సలార్ (2023)
సలార్ సినిమాకి.. మాస్ హీరోగా రఫ్ లుక్‌లో కనిపించిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రాజాసాబ్
రాజాసాబ్ లుక్స్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ లుక్, ట్రైలర్, విజువల్స్‌లో వింటేజ్ ప్రభాస్ కనిపించాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
డార్లింగ్ సినిమాలో కూడా ఎవరూ ట్రై చేయని ఫ్యాషన్ లుక్‌లో కనిపించాడు ప్రభాస్. తను చేసిన ప్రతి సినిమాలో లుక్‌ని మార్చి అభిమానులు అలరించాడు. కల్కీ, రాధే శ్యామ్, ఆది పురుష్ ఇలా ప్రతి సినిమాల్లోనూ వైవిధ్యంగా కనిపించాడు.






















