(Source: ECI/ABP News/ABP Majha)
Devara Success Meet: దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ చేయడానికి కారణాలు... అసలు విషయం చెప్పిన నాగవంశీ
Devara success meet cancelled: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'దేవర' పార్ట్ 1 సక్సెస్ మీట్ జరగడం లేదు. ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేసింది. అందుకు కారణాలు ఏమిటంటే?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR Jr) కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'దేవర' (Devara Movie). మొదటి రోజు, ఆ మాటకు వస్తే బెనిఫిట్ షోస్ నుండి ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినా సరే సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది అంటే అందుకు కారణం ఎన్టీఆర్ స్టార్ పవర్.
తనకు ఇంతటి మధురమైన విజయం అందించిన అభిమానులు ప్రేక్షకులతో కలిసి ఎన్టీఆర్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ, రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు. ఈ రోజు జరగాల్సిన దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయింది.
దేవర సక్సెస్ మీట్ చేయడం లేదు...
స్పష్టం చేసిన నిర్మాత నాగవంశీ సూర్యదేవర!
'దేవర' చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ పంపిణీ చేశారు. ఏపీలో టికెట్ రేట్స్ హైక్ కోసం కూడా ఆయనే అప్లై చేశారు. 'దేవర' సక్సెస్ మీట్ క్యాన్సిల్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన ఎన్టీఆర్ అభిమానులు, ప్రేక్షకులకు తెలియజేశారు.
దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ చేయడానికి కారణాలు!
'దేవర' చిత్రానికి ఇంతటి ఘన విజయం అందించిన... బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులు క్రియేట్ చేయడానికి కారణమైన ప్రేక్షకులకు, హీరో అభిమానులకు, ప్రతి ఒక్కరికి సూర్యదేవర నాగ వంశీ థాంక్స్ చెప్పారు.
''ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగని కారణంగా 'దేవర' విజయాన్ని ఏపీ, తెలంగాణ - రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులతో భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలని తారక్ అన్న భావించారు. సక్సెస్ మీట్ చేయడం కోసం మేము తీవ్రంగా ప్రయత్నించాం. కానీ, దసరా - దేవి నవరాత్రి ఉత్సవాల వల్ల అవుట్ డోర్ ఈవెంట్ చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతులు లభించలేదు. పరిస్థితి మా కంట్రోల్ దాటింది. 'దేవర' సక్సెస్ మీట్ ఈవెంట్ చేయలేక పోతున్నందుకు అభిమానులు, ప్రేక్షకులు అందరికీ మేము క్షమాపణలు చెబుతున్నాం. ఇప్పటికీ మా ప్రయత్నాలు ఆపలేదు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను'' అని నాగవంశీ ట్వీట్ చేశారు.
Also Read: ఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
A big thank you to each and every one of you who played a part in creating the #DevaraStorm and setting unprecedented records at the BOX OFFICE.
— Naga Vamsi (@vamsi84) October 3, 2024
Since the pre-release event couldn’t be held, Tarak anna was adamant about having an event to CELEBRATE the Success of Devara in a BIG… pic.twitter.com/kyxAhy3CnN
'దేవర' ఫస్ట్ వీకెండ్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత కలెక్షన్లు తగ్గుతాయి అది అన్ని సినిమాలకు జరిగేదే. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అయితే అక్టోబర్ రెండున గాంధీ జయంతి ఉండడంతో హిందీలో మంచి వసూళ్లు వచ్చాయి. దసరా సెలవులు కారణంగా మరో పది రోజుల వరకు సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని అర్థం అవుతోంది.
Also Read: అటెన్షన్ కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సిగ్గుచేటు - కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి ట్వీట్!