By: ABP Desam | Updated at : 02 Mar 2022 04:56 PM (IST)
రష్మిక
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే... అది స్నేహం కాదని, ప్రేమ అని చాలా మంది అంటుంటారు. ఇద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు ఉన్నాయనే మాటలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూ ఉంటాయి. వీటిపై రష్మికా మందన్నా స్పందించారు.
విజయ్ దేవరకొండతో పెళ్లి అని వస్తున్న వార్తలపై రష్మిక మాట్లాడుతూ "టైమ్ పాస్ కోసం రాసే రూమర్ అది. సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా. నా పెళ్లికి ఇంకా టైమ్ ఉంది. రూమర్స్ చూసి... 'రాసుకోనివ్వండి' అనుకుంటా" అని అన్నారు. పెళ్లి గురించి రష్మిక స్పందించడం ఇది తొలిసారి కాదు. కొన్ని రోజుల క్రితం కూడా ఆమె మాట్లాడారు.
'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో "పెళ్లి చేసుకోవడానికి నేనింకా చిన్న పిల్లనే. పెళ్లి గురించి ఆలోచించలేదు. అయితే... మనల్ని అర్థం చేసుకునేవాళ్లను పెళ్లి చేసుకోవడం ముఖ్యం" అని రష్మిక పేర్కొన్నారు. మరి, ప్రేమ గురించి అని ఆమెను ప్రశ్నిస్తే... "ప్రేమను వర్ణించడం కష్టం. ఎందుకంటే... ప్రేమ అనేది అనుభూతి కదా! మన ఫీలింగ్స్ కదా! నా దృష్టిలో ప్రేమ అంటే ఒకరిని ఒకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం. నిర్భయంగా ఉండటం. అది ఇరువైపుల నుంచి ఉన్నప్పుడే లవ్ వర్కవుట్ అవుతుంది" అని సమాధానం ఇచ్చారు.
Also Read: అప్పుడే పెళ్లేంటి? నేనింకా చిన్న పిల్లనే అంటోన్న రష్మిక
తెలుగులో కథానాయికగా పరిచయం కాకముందు రష్మిక ఒకసారి ప్రేమలో పడ్డారు. కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన కొన్నాళ్లకు నిశ్చితార్థం చేసుకున్నారు. ఏమైందో? ఏమో? దాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో రష్మికా మందన్న ప్రేమలో పడినట్టు ప్రచారం జరుగుతోంది. 'పుష్ప: ద రైజ్'తో విజయం అందుకున్న రష్మిక, ఈ శుక్రవారం 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్వరలో 'పుష్ప 2' షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. హిందీలో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' సినిమాలు చేస్తున్నారు. కథానాయికగా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఇప్పట్లో రష్మిక పెళ్లి గురించి ఆలోచించే అవకాశాలు తక్కువనే చెప్పాలి.
Also Read: శర్వానంద్ ఇంటి నుంచి రష్మికకు భోజనం - 'పుష్ప' సెట్స్ నుంచి రిలాక్సేషన్!
Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!
Major Movie: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
Anil Ravipudi: ఎన్టీఆర్ తో సినిమా - అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
Prey Teaser: ‘ప్రే’ టీజర్ చూశారా? మరింత భయానకంగా ప్రిడేటర్ ప్రీక్వెల్
Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!
Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు
YSRCP Rajya Sabha: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ