Rashmika Mandanna: ఫైనల్గా రిలేషన్షిప్లో ఉన్నట్టు ఒప్పుకున్న రష్మిక... విజయ్ దేవరకొండతో ఆ ఒక్కటి మాత్రం సస్పెన్స్
Rashmika Mandanna : రష్మిక మందన్న రిలేషన్షిప్లో ఉన్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కన్ఫామ్ చేసింది. కానీ తన పార్టనర్ పేరును వెల్లడించలేదు.
హిందీ పీరియాడికల్ డ్రామా 'ఛావా'లో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా రష్మిక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే ఆ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ రిలేషన్షిప్ లో ఉన్నట్టు కన్ఫర్మ్ చేసింది. కానీ ఎప్పటిలాగే ఆమె తన పార్టనర్ పేరును మాత్రం బయట పెట్టలేదు.
రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేసిన రష్మిక
విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పీరియాడికల్ డ్రామా 'ఛావా'. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన 'హ్యాపీ ప్లేస్' గురించి మాట్లాడింది. రష్మిక ఈ విషయం గురించి స్పందిస్తూ "నాకు సంతోషంగా అనిపించే ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఇల్లే. ఇంట్లో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎక్కడ లేని ఆనందం ఇంట్లోనే ఉంటుంది. ఎంతోమంది ప్రేమాభిమానాలు సొంతం చేసుకున్నప్పటికీ నేనొక కూతురిని, సోదరిని. అలాగే భాగస్వామిగా నా జీవితాన్ని గౌరవిస్తాను. అది కంప్లీట్ గా నా పర్సనల్ లైఫ్" అని చెప్పుకొచ్చింది.
ఇక ఆ తర్వాత ఎదుటి వ్యక్తిలో తనను అట్రాక్ట్ చేసే విషయాల గురించి రష్మిక మాట్లాడింది. "కళ్ళు మన మనసును ప్రతిబింబిస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. అందుకే కళ్ళతో పలికించే హావభావాలు చాలా ముఖ్యం. నవ్వుతూ ఉండే వ్యక్తులను ఎక్కువగా ఇష్టపడతాను. అలాగే ఎదుటి వారితో దయగా ప్రవర్తిస్తూ, గౌరవించేవారు అంటే నాకు చాలా ఇష్టం" అంటూ రష్మిక తన పార్ట్నర్ గురించి మాట్లాడిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంకేముంది ఎప్పటిలాగే రష్మిక విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎక్కువగా విజయ్ దేవరకొండ ఇంట్లోనే...
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న రిలేషన్షిప్ లో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ గురించి వస్తున్న వార్తలపై ఇన్ డైరెక్ట్ గా స్పందిస్తారు వీళ్ళిద్దరూ. అంతేకానీ ఎప్పుడూ తమ రిలేషన్షిప్ పై క్లారిటీ ఇవ్వలేదు. గతంలో బాలీవుడ్ నటి అనన్య పాండే వీరిద్దరూ లవ్ లో ఉన్నారని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. అలాగే 'హాయ్ నాన్న' మూవీ ప్రమోషన్లలో ఏకంగా వీరిద్దరూ బీచ్ లో ఉన్న ఫోటోని స్క్రీన్ పై ప్రదర్శించారు. ఇక 'డాకు మహారాజ్' ప్రమోషన్లలో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ "రష్మిక ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని తెలుసు. కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది నాకు తెలియదు" అంటూ ఇన్ డైరెక్ట్ గా సమాధానం చెప్పారు. అప్పటినుంచి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్ వైరల్ గా మారింది.
Also Read: 'దిల్' రాజుకు రామ్ చరణ్ మరో సినిమానా? సారీ... ప్రజెంట్ కమిట్మెంట్ ఏదీ లేదు
గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తను రిలేషన్షిప్ లో ఉన్నట్టు ఒప్పుకున్నాడు. అయితే టైం వచ్చినప్పుడు తానే స్వయంగా ఆ విషయాలను పంచుకుంటానని స్పష్టం చేశాడు. ఇక రష్మిక మందన్న తన ఇంట్లో కంటే ఎక్కువగా విజయ్ దేవరకొండ ఇంట్లోనే కన్పిస్తుంది. గత ఏడాది దేవరకొండ ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'ని కూడా దేవరకొండ ఫ్యామిలీతోనే కలిసి చూసింది.