అన్వేషించండి

Rashmika Mandanna: ఆ రోజు నా జీవితంలో చాలా స్పెషల్... రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్ వైరల్

హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. 'పుష్ప 2' సెట్లో ఇదే చివరి రోజు అంటూ సుధీర్ఘ పోస్ట్ చేసింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా తన జీవితంలో నవంబర్ 25 చాలా ప్రత్యేకమైన రోజు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆ డేట్ ఎందుకు స్పెషల్? అనే విషయాన్ని వివరంగా వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఓ సుధీర్ఘ పోస్ట్ చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ "పుష్ప ది రూల్". క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా సోమవారంతో షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఏళ్ల నుంచి ఈ సినిమా కోసం తాను వర్క్ చేస్తున్నానని వెల్లడించిన రష్మిక, ఇక సెట్ లో అడుగు పెట్టడం కుదరదని తెలిసి ఎంతో భావోద్వేగానికి గురయ్యానంటూ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో రష్మిక "డియర్ డైరీ... నవంబర్ 25 నా జీవితంలో ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న ప్రత్యేకమైన రోజు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నవంబర్ 24వ తేదీన సాయంత్రం మేము అందరం షూటింగ్ పూర్తి చేసి, చెన్నైలో ఈవెంట్ కు వెళ్ళాము. అదే రోజు హైదరాబాద్ కు తిరిగి వచ్చాము. ఇంటికి వెళ్లి దాదాపు నాలుగు గంటల పాటు నిద్రపోయాను. ఇక ఉదయాన్నే నిద్ర లేచి, పుష్ప షూటింగ్ కోసం పరుగులు పెట్టాను. అయితే ఈ సినిమాకు ఇదే నా ఆఖరి రోజు షూటింగ్. ఆరోజు స్పెషల్ సాంగ్ షూట్ చేశాము. రాత్రి వరకు సెట్ లోనే ఉన్నాము. కానీ అది ఆఖరి రోజులా నాకు అస్సలు అనిపించలేదు. గత ఐదేళ్లుగా ఈ సినిమా సెట్ లోనే గడిపాను. అందుకే పుష్ప సెట్ నాకొక ఇల్లులా మారిపోయింది. ఇప్పటి వరకు పడిన ఈ సినిమా కోసం పడిన కష్టం, నీరసం... చివరి రోజు కావడంతో అన్ని నా కళ్ళ ముందు కదిలాయి. ఓవైపు ఆనందం, మరోవైపు టీంతో పాటు సెట్ ను కూడా విడిచి పెడుతున్నానని బాధ... ఇలా రకరకాల భావోద్వేగలతో మనసు నిండిపోయింది. ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని ఇకపై మిస్ అవుతాను. ఎంతో కాలం తర్వాత బాధతో బాగా ఏడ్చాను. నేను ఆ విధంగా ఎందుకు రియాక్ట్ అయ్యానో కూడా అర్థం కాలేదు" అంటూ సోషల్ మీడియాలో పంచుకుంది.

Also Read: దేవి శ్రీ ప్రసాద్ మాటల్లో తప్పేముంది? - పుష్ప 2 మ్యూజిక్ ఇష్యూ మీద నిర్మాత రవిశంకర్ రియాక్షన్

ఇక సుకుమార్ అల్లు అర్జున్ లతో తనకు మంచి అనుబంధం ఉందన్న విషయాన్ని రష్మిక గుర్తుచేసుకుంది. ఇదిలా ఉండగా డిసెంబర్ 5న "పుష్ప ది రైజ్" మూవీకి సీక్వెల్ గా "పుష్ప ది రూల్" మూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. సినిమా రిలీజ్ కు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అలాగే సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. 

Read Also : Naga Chaitanya - Fake News Alert: అదంతా రూమరే... నాగచైతన్య - శోభిత ధూళిపాళ పెళ్లి గురించి జరుగుతున్న ఆ ప్రచారంలో నిజం లేదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Kasturba Gandhi School: 300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Embed widget