అన్వేషించండి

Kalki 2898 AD: భర్తతో కలిసి ‘కల్కీ 2898 ఏడీ’ చూసిన దీపిక - రణవీర్ స్పందన ‘అత్యుత్తమం’

ఇండియన్ సినిమాల్లో అత్యుత్తమ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ అంటూ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రశంసలు కురిపించారు. తన భార్య దీపికా పదుకొణెతో కలిసి ఈ మూవీ చూసిన తర్వాత చిత్రబృందాన్ని ఆయన అభినందించారు.

Ranveer Singh Review On Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ సినిమా 'కల్కి 2898 AD' సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. నాగ్ అశ్విన్ తెర మీద అద్భుతాన్ని ఆవిష్కరించారంటూ సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్ స్టార్ హీరో, దీపికా పదుకొణె భర్త రణవీర్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా ఓ అద్భుతమన్న ఆయన, దీపికా నటనపైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇండియన్ సినిమాల్లో బెస్ట్ మూవీ ‘కల్కి’- రణవీర్

తన భార్య దీపికా పదుకొణెతో కలిసి ముంబైలోని పీవీఆర్ లో ఆయన 'కల్కి 2898 AD' సినిమాను చూశారు. ఈ సందర్భంగా సినిమాపై ప్రశంసలు కురిపించారు. తన ఇన్ స్టా వేదికగా ‘కల్కి’ పోస్టర్ ను షేర్ చేస్తూ కీలక విషయాలు వెల్లడించారు. తన భార్యతో మిగతా నటీనటులపై అభినందనలు కురిపించారు. ఒక్కో యాక్టర్ ను పేరు పేరునా అభినందించారు. “'కల్కి 2898 AD'ఓ అద్భుతమైన సినిమా. నిజమైన బిగ్ స్ర్కీన్ మూవీ. భారతీయ సినిమాలో అత్యున్నతమైనది. నాగి సర్, మొత్తం టీమ్ కు అభినందనలు. రెబల్ స్టార్ రాక్ స్టార్, ఉలగనాయగన్ ఈజ్ ది బెస్ట్” అంటూ ప్రభాస్, కమల్ హాసన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. “మీరు నాలా అమితాబ్ వీరాభిమాని అయితే, ఈ సినిమాను మిస్ చేయలేరు. నా బేబీ దీపికా పదుకొణె అద్భుతంగా నటించింది. లవ్ యు” అంటూ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణెను అభినందిచారు.   

బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తున్న ‘కల్కి’

ఇక 'కల్కి 2898 AD' సినిమా 6 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. భారత్ లో సుమారు రూ. 410 కోట్లు వసూళు చేసింది. ఓవర్సీస్ లో రూ.160 కోట్లు సాధించింది. ఇవాళ్టితో ఈ సినిమా రూ. 600 కోట్ల మార్క్ ను క్రాస్ చేసి ఉంటుంది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మాతగా ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజిలో ఈ సినిమాను రూపొందించారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

దీపిక, రణవీర్‌ సింగ్ సినిమాలు

అటు దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కలిసి ‘సింగ్ ఎగైన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఇద్దరు మరికొన్ని సినిమాలు చేస్తున్నారు.

Read Also: ‘మీర్జాపూర్‌’ సీజన్‌ 3 ట్రైలర్‌: గుడ్డూను టార్గెట్ చేసిన ఖాలీన్ భయ్యా - ఇక సింహాసనం కోసం పోరు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Revanth Meeting: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహూర్తం ఫిక్స్ - చర్చించనున్న అంశాలివే, సర్వత్రా ఆసక్తి
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహూర్తం ఫిక్స్ - చర్చించనున్న అంశాలివే, సర్వత్రా ఆసక్తి
Telangana Jobs: జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌‌ హత్య- ఫుడ్‌ డెలవరీ బాయ్స్‌గా వచ్చిన దుండగులు
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌‌ హత్య- ఫుడ్‌ డెలవరీ బాయ్స్‌గా వచ్చిన దుండగులు
Amaravathi Roads: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్- అమరావతి నిర్మాణంలో మరో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్- అమరావతి నిర్మాణంలో మరో కీలక పరిణామం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Doddi Komaraiah Death Anniversary | కడవెండి పౌరుషం తెలంగాణ మట్టిని ముద్దాడి 78 సంవత్సరాలు పూర్తిVirat Kohli Emotional Speech About Jasprit Bumrah | బుమ్రా ఈ దేశపు ఆస్తి అంటున్న కోహ్లీ | ABP DesamVirat Kohli Emotional About Rohit Sharma |15 ఏళ్లలో రోహిత్ శర్మను అలా చూడలేదంటున్న విరాట్ కోహ్లీJagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Revanth Meeting: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహూర్తం ఫిక్స్ - చర్చించనున్న అంశాలివే, సర్వత్రా ఆసక్తి
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహూర్తం ఫిక్స్ - చర్చించనున్న అంశాలివే, సర్వత్రా ఆసక్తి
Telangana Jobs: జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌‌ హత్య- ఫుడ్‌ డెలవరీ బాయ్స్‌గా వచ్చిన దుండగులు
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌‌ హత్య- ఫుడ్‌ డెలవరీ బాయ్స్‌గా వచ్చిన దుండగులు
Amaravathi Roads: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్- అమరావతి నిర్మాణంలో మరో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్- అమరావతి నిర్మాణంలో మరో కీలక పరిణామం
Annamayya District: వంట చేయడానికి వచ్చి దుప్పటి సాయంతో ఖైదీ జంప్- రాజంపేట సబ్ జైలులో ఘటన
వంట చేయడానికి వచ్చి దుప్పటి సాయంతో ఖైదీ జంప్- రాజంపేట సబ్ జైలులో ఘటన
Free Gas Cylinder Scheme : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్- ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ స్కీమ్ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్- ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ స్కీమ్ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Viral News: ఊళ్లో తగవు తీర్చలేక తలలు పట్టుకున్న పోలీసులు, ఇట్టే పరిష్కరించిన బర్రె
ఊళ్లో తగవు తీర్చలేక తలలు పట్టుకున్న పోలీసులు, ఇట్టే పరిష్కరించిన బర్రె
India vs Zimbabwe: యువ భారత్‌ వేట, జింబాబ్వే ఆపగలదా? తొలి మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ?
యువ భారత్‌ వేట, జింబాబ్వే ఆపగలదా? తొలి మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ?
Embed widget