అన్వేషించండి

Rangabali Promotion: కమెడియన్ సత్య వీడియోపై ఆ జర్నలిస్టులు అసంతృప్తి - ‘రంగబలి’ మూవీ టీమ్‌పై తీవ్ర ఒత్తిడి?

'రంగబలి' మూవీ ప్రమోషన్ లో భాగంగా కమెడియన్ సత్య, నాగశౌర్యను ఇంటర్వ్యూ చేసిన ప్రోమో బాగా వైరల్ అయ్యింది. అయితే, ఈ వీడియో చూసి ఆ జర్నలిస్టులను తెగ బాధపడుతున్నారట!

ప్రస్తుత రోజుల్లో మంచి సినిమాలను తెరకెక్కించగానే సరిపోదు. వాటిని జనాల బుర్రల్లోకి ఎక్కేలా ప్రమోట్ చేయాలి. సినిమాను ఎలాగైనా వీలైనంత ఎక్కువ మార్కెట్ చేయాలి. అప్పుడే ఆడియెన్స్ మూవీ పట్ల ఆకర్షితులు అవుతారు. మంచి సినిమా చేశాం. ప్రమోషన్ లేకపోయినా ప్రేక్షకులు వస్తారని భావిస్తే, ఒక్కోసారి సినిమా ఇలా థియేటర్ లోకి వచ్చి అలా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, మేకర్స్ తమ సినిమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అద్భుతమైన, విభిన్నమైన వ్యూహాలను రూపొందిస్తున్నారు. తాజాగా ‘రంగబలి’ సినిమా విషయంలోనూ మేకర్స్ ఇదే పంథాను అవలంబించారు.

లోలోపల కుమిలిపోతున్న ఆ జర్నలిస్టులు

‘రంగబలి’ కోసం మీడియాలో పలువురు పాపులర్ జర్నలిస్టుల గెటప్ లో కమెడియన్ సత్య, హీరో నాగశౌర్యను ఇంటర్వ్యూ చేశాడు. ఈ ప్రమోషనల్ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి ఆ జర్నలిస్టులకు మాత్రం కక్కలేక మింగలేక అన్నట్లు ఫీలయ్యారట. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు బాగా హర్ట్ అయ్యారట. వారి మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయట. వెంటనే వాళ్లు ‘రంగబలి’ టీమ్‌కి సమాచారం అందించారట. ఈ నేపథ్యంలోనే ‘రంగబలి’కి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూను విడుదల చేయలేదట మేకర్స్. పూర్తి వీడియోను చాలా మంది అభ్యర్థించినప్పటికీ, మనోభావాలు దెబ్బతింటాయనే కారణంగా దానిని తాత్కాలికంగా నిలిపివేశారట.

ఆ జర్నలిస్టులను అద్భుతంగా ఇమిటేట్ చేసిన సత్య 

ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ టాలెంటెడ్ కమెడియన్స్ లో సత్య ఒకరు. ఇప్పటికే అగ్ర హీరోల సినిమాల్లో సత్య తన కామెడీ టైమింగ్ తో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు 'రంగబలి' సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు రాబోతున్నాడు. యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రంగబలి'. జూలై 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు. అందులో పలు టీవీ, యూట్యూబ్ చానెళ్లలో ఇంటర్వ్యూలు చేసే పాపులర్ యాంకర్స్, మూవీ ప్రెస్ మీట్స్‌ లో వివాదాస్పద ప్రశ్నలు వేసే విలేకరులను సత్య ఇమిటేట్ చేయడమే కాకుండా ఆ జర్నలిస్టుల గెటప్స్ లో కనిపించాడు. వారిని అచ్చంగా దించేశాడు. ఓ లేడీ యాంకర్ ని ఇమిటేట్ చేస్తూ.. గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో అని అరవడం ఈ ప్రోమోలనే హైలెట్ గా నిలిచింది.

‘రంగబలి’ సినిమా ద్వారా నూతన దర్శకుడు పవన్ భాసం శెట్టి టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. పవన్ సిహెచ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగశౌర్య గత చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. మరి ఈ 'రంగబలి' సినిమా నాగశౌర్య కి ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.

Read Also: పవర్ స్టార్ ‘తొలి ప్రేమ’ చూసి కారు కీస్ టీవీ స్క్రీన్‌పై విసిరిన అమితాబ్, బిగ్‌బీ ఎందుకంత ఇరిటేట్ అయ్యారు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget