అన్వేషించండి

Venky 75: ఒకే వేదికపై టాలీవుడ్ సీనియర్ హీరోలు - వెంకటేశ్ కోసం కదలివస్తున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున

Venkatesh Daggubati: టాలీవుడ్ సీనియర్ హీరోలు అందరినీ ఒకే వేదికపై చూడాలని ప్రేక్షకులకు ఎంతగానో కోరిక ఉంటుంది. త్వరలోనే ఆ కోరిక నిజం కానుంది.

Venky 75: ఎంతోమంది సీనియర్ హీరోలు మూడు దశాబ్దాలు అయిపోయినా కూడా ఇంకా ఇండస్ట్రీలో స్టార్లుగా వెలిగిపోతున్నారు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ.. స్క్రిప్ట్ సెలక్షన్‌లో కొత్తదనాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అందులో హీరో వెంకటేశ్ కూడా ఒకరు. దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన వెంకటేశ్.. ఇప్పటికే హీరోగా 74 సినిమాలను పూర్తి చేసుకుంది. తన కెరీర్‌లో 75వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘సైంధవ్’. కెరీర్‌లో 75 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకటేశ్ కోసం ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడట దగ్గుబాటి రానా. ఈ సర్‌ప్రైజ్ పార్టీ కోసం టాలీవుడ్‌లోనే సీరియర్, జూనియర్ అని తేడా లేకుండా హీరోలందరూ తరలిరానున్నారు.

‘వెంకీ 75’..
1986లో ‘కలియుగ పాండవులు’ అనే చిత్రంతో హీరోగా వెండితెరపై అడుగుపెట్టారు వెంకటేశ్. ఆ తర్వాత ఎన్నో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలలో నటించి.. దగ్గుబాటి వెంకటేశ్ నుండి విక్టరీ వెంకటేశ్ అయిపోయారు. ముఖ్యంగా అప్పుడు ఉన్న హీరోలలో ఎక్కువగా ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న హీరో వెంకటేశే. ఇప్పుడు తన కెరీర్‌లోనే ల్యాండ్ మార్క్ మూవీ అయిన ‘సైంధవ్’ షూటింగ్‌లో వెంకీ మామ బిజీగా ఉన్నారు. అందుకే ‘వెంకీ 75’ అనే పేరుతో ఒక ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నాడు రానా. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ఈవెంట్‌కు ఏర్పాట్లు మొదలయ్యాయి. డిసెంబర్ 27న టాలీవుడ్‌లోని ప్రముఖ తారలతో ఈవెంట్ నిండిపోనుంది.

సీనియర్, జూనియర్ తేడా లేదు..
ఒకప్పుడు సినిమాల విషయంలో వెంకటేశ్‌కు పోటీ ఇచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలాంటి సీనియర్ హీరోలు ‘వెంకీ 75’ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. వారితో పాటు నాని, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, శ్రీవిష్ణు వంటి యంగ్ హీరోలు కూడా ఇందులో పాల్గోనున్నారు. కేవలం హీరోలు మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోని ఫేమస్ టెక్నిషియన్లు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా ఎంతోమంది ఈ ఈవెంట్‌కు రానున్నట్టు సమాచారం. ఎంతోకాలం తర్వాత సీనియర్ హీరోలందరినీ ఒకేచోట చూడడం కోసం టాలీవుడ్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా ఈ ఈవెంట్ వల్ల వెంకటేశ్ 75వ చిత్రం ‘సైంధవ్’కు తగినంత ప్రమోషన్ లభిస్తోంది. 

హిట్‌వర్స్‌తో క్రేజీ డైరెక్టర్‌గా..
‘హిట్’ ఫ్రాంచైజ్‌తో ఇప్పటికే టాలీవుడ్‌లో తగినంత క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు శైలేష్ కొలను. కోలీవుడ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లాగా టాలీవుడ్‌లో మొదటిసారిగా హిట్‌వర్స్‌ను క్రియేట్ చేశాడు. అంటే ఇప్పటివరకు వచ్చిన ‘హిట్’ సినిమా ఫ్రాంచైజ్‌లు అన్ని ఒకదానితో ఒకటి కనెక్టెడ్ ఉంటాయి. ఇప్పటికే హిట్‌వర్స్‌లో రెండు పార్ట్స్ తెరకెక్కించిన శైలేష్.. మూడో పార్ట్ కోసం నానిని హీరోగా ఎంపిక చేసుకున్నాడు. కానీ ఆ మూవీ సెట్స్‌పైకి వెళ్లడానికి సమయం పడుతుందని తెలిసి.. ‘సైంధవ్’ కథతో వెంకటేశ్‌ను ఇంప్రెస్ చేశాడు. ఈ మూవీలో వెంకటేశ్‌కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రల్లో రుహానీ శర్మ, ఆండ్రియా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘సైంధవ్’ కోసం వెంకటేశ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు.

Also Read: ఈ ఇయర్ ఎండ్ వారాంతంలో సినిమాల సందడి - ఓటీటీ థియేటర్స్‌లో రిలీజయ్యే క్రేజీ మూవీస్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Embed widget