Alekhya Chitti Sisters: మమ్మల్ని రోడ్డుమీదకు లాగేశారు... శవం ఫోటోనూ వదల్లేదు... హాస్పటల్ నుంచి మీమర్స్‌పై అలేఖ్య సిస్టర్స్ ఫైర్!
Alekhya Chitti Sisters: మా అక్క అలేఖ్య చిట్టి సారీ వీడియో పోస్ట్ చేసింది. చాలా బాధ పడుతూ వీడియో చేసింది. ఇప్పుడు హాస్పిటల్‌లో సఫర్ అవుతుందంటూ అలేఖ్య సిస్టర్స్ వీడియోను పోస్ట్ చేశారు.

Alekhya Chitti Sisters: అలేఖ్య చిట్టి పచ్చళ్ల కాంట్రవర్సీ రోజు రోజుకీ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ముగ్గురు సిస్టర్స్‌లో అలేఖ్య చిట్టి తప్పు చేశానని, ఓ వీడియోను విడుదల చేసినా సరే... ఆమెపై మీమ్స్ ఆగడం లేదు. ఛానళ్ల వాళ్లు కూడా ఆ సిస్టర్స్‌తో ఇంటర్వ్యూలో కోసం ఎగబడుతున్నారు. ఒక్కసారిగా ఫేమస్ అయినా ప్రాబ్లమే అనేది ఈ ముగ్గురు సిస్టర్స్ విషయంలో తెలుస్తుంది. అలాగే నోటిదూల మనిషిని ఎంత వరకు తీసుకెళుతుందో, అలేఖ్య విషయంలో మరోసారి రుజువైందని, కర్మ ఇలానే వెంటాడుతుందనేలా.. ఈ సిస్టర్స్‌పై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరోవైపు అలేఖ్య హాస్పిటల్ పాలైందని, ఇకనైనా ట్రోలింగ్ ఆపాలని అలేఖ్య సిస్టర్స్ తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తన సిస్టర్ హాస్పిటల్‌లో సఫర్ అవుతుందని, ఒక ఆడపిల్లని ఇలా టార్గెట్ చేస్తారా? అంటూ ఓ రేంజ్‌లో అలేఖ్య సిస్టర్స్ ఇద్దరూ ఈ వీడియోలో మాట్లాడారు.
అలేఖ్య చిట్టి సిస్టర్స్ మాట్లాడుతూ... ‘‘మా అక్క అలేఖ్య చిట్టి సారీ వీడియో పోస్ట్ చేసింది. చాలా బాధ పడుతూ వీడియో చేసిందండి. దానిని కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, మీమర్స్, న్యూస్ ఛానెల్స్ వాళ్ళు నెగెటివ్‌గా చూపించడంతో మా అక్క చాలా సఫర్ అయ్యి, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. అంతే కాకుండా ఇప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ చేయాల్సి వచ్చింది. దీనంతటికి కారణం ఛానెల్స్ వాళ్లే. అసలు ఎందుకంతలా ఒక ఆడపిల్లని టార్గెట్ చేసి... భాధ పెట్టాల్సిన అవసరం ఏంటో నాకసలు అర్థం కావడం లేదు. ఇప్పటికే చాలా భారాన్ని మోస్తూ వచ్చింది. తనని ఒక్కదాన్నే వదిలేస్తే ఏమైపోతుందో అని భయపడుతూ వస్తున్నాం. కానీ అనుకున్నదే జరిగింది. ఇలా ఈ రోజు హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మా నాన్న గారికి కూడా ఇలాగే 3 నెలల కిందట జరిగి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మా అక్కకి కూడా అలాగే జరిగింది. మా అక్కకి ఏమన్నా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా చెప్పండి.
మమ్మల్ని నిండా ముంచేసి రోడ్డు మీదకి లాగేశారు. మేమూ ఆడవాళ్ళమే కదండీ.. మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు కదా. వాళ్ళకి కూడా ఇలానే చేస్తారా. మా నాన్న చనిపోతే మేమేదో ఆయనికి నచ్చినట్లు సమాధి చేసుకున్నాం. సమాధి ఫోటోని కూడా మీమ్స్‌గా వేసుకున్నారంటే.. ఆఖరికి శవం ఫోటో కూడా మీమ్స్‌గా వేసుకుంటున్నారు. మేము మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాం. దయచేసి మాపై మీమ్స్ చేయొద్దు అని ఇప్పటికి అడుక్కుంటున్నాం. మా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశారు. కొంతమంది మా ఇంట్లో కొట్టారు, తిట్టారు అని కొంతమంది, కొంతమంది అయితే వాంతులు చేసుకున్నట్లు, కొందరు ఇలా చేస్తే వ్యూస్ వస్తాయా అని.. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తున్నారు. మా ప్రొడక్ట్ నచ్చకపోతే కస్టమర్స్ వచ్చి చెబితే మేము వేరే ప్రొడక్ట్ సజెస్ట్ చేసేవాళ్ళం. ఒకావిడైతే నేను అలేఖ్య చిట్టి పికెల్స్ తీసుకున్నాను. అవి అసలు ఏమి బాగాలేవు. అనవసరంగా తీసుకున్నాను. నా మనీ వేస్ట్ అయ్యాయని దాదాపు 11 వీడియోలు చేసింది. వాటివల్ల ఆవిడా బాగా డబ్బులు సంపాదించుకుంది.
మీకు మనిషి ప్రాణాల కంటే వ్యూస్, డబ్బులు కావాలి అంతేగా. మా అక్క ప్రాణాలతో పోరాడుతుంది. నేను చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే బయట ఆంధ్ర, తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని గురించి ట్రోల్స్, ట్రెండింగ్ చేయండి. వాటిని పట్టించుకోండి. అంతే కానీ ఇలా పచ్చళ్ళ గురించి ఎందుకండి? మా అక్క చాలా మంచిదండి. పైకి అలా గంభీరంగా కనిపిస్తుంది కానీ.. చాలా సెన్సెటివ్ అండి. దయచేసి ఇంకా ట్రోల్స్ చేయడం ఆపేయండి ప్లీజ్. ఇంకా తాను చచ్చిపోవాలనుకుంటేనే ట్రోల్స్ చేయాలంటే చేయండి. కొంతమంది కామెంట్స్ చూసాము. తాను ఏడుస్తున్నట్లు లేదు. ఏడవడం కూడా ఒక యాక్టింగ్ అంటే ఏం చేయాలో మీరే చెప్పండి. ఇలా మీరు ప్రతిదీ యాక్టింగ్ అంటే ఏం చేయలేమండీ. దయచేసి తన మీద మీరు చేస్తున్న ట్రోల్స్, మీమ్స్ ఆపేయండి. మా అక్క చాలా సీరియస్ కండిషన్‌లో ఉంది. తనకి ఏదైనా జరిగితే మాత్రం ట్రోల్స్ చేస్తున్న ఛానెల్స్ వాళ్ళు, మీమ్స్ వేసిన వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పటం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మేము ఏది ప్రూవ్ చేసుకోవాలనుకోవడం లేదు.
ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా మాటలు పడ్డాము. ఇప్పటికే మా అక్క కండిషన్ ఇలా ఉంది. దయచేసి ఇప్పటికైనా ఇవన్నీ ఆపేయండి ప్లీజ్. పెద్ద పెద్ద తప్పులు చేసే వాళ్ళు బాగుంటున్నారు. చక్కగా తిరిగేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద ఎందుకింత టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఒక అమ్మాయి ఎవరి సపోర్ట్ లేకుండా ఎదుగుతుంటే చూడలేరు అని అర్ధమైంది. మా అమ్మ మా నాన్నని కోల్పోయి ఎంతగానో భాధ పడుతున్నారు. ఇప్పుడు మా అక్క పరిస్థితికి ఇంకా బాధపడుతున్నారు. అందుకు కారణం కూడా మీరే. ఇప్పుడు మేమున్న పరిస్థితిలో కూడా మా ఇంటికి వచ్చి ఛానెల్స్ వాళ్ళు వచ్చి వీడియోలు అడుగుతున్నారు. ఇవన్నీ కాదండి ఇప్పుడు మా అక్కకి కానీ, మా అమ్మకి కానీ ఏదైనా జరిగితే మీరు బాధ్యత తీసుకుంటారా చెప్పండి. మా అక్క చేసిందంతా తప్పే.. దానికి సరిపడా శిక్ష అనుభవించింది. మా అక్క పశ్చాత్తపపడుతుంది. దానిని తెలుసుకోండి. అసలు ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి మొదలయ్యిదంటే నెగిటివ్ రివ్యూల నుంచి మొదలైంది. నిజంగా ప్రొడక్ట్ బాగోకపోతే మాకు రిఫండ్ చేయండి. ఇంకో పార్శిల్ పంపించడం జరుగుతుంది. ఒక్కొక్కరు 10, 11 వీడియోలు పెడుతున్నారు. మాపై ఎందుకంత కక్ష? ఇకనైనా ఆపండి’’ అంటూ ఈ వీడియోలో వేడుకుంది.





















