News
News
వీడియోలు ఆటలు
X

రామ్ పోతినేని బర్త్‌డేకు భారీ ధమాకా ప్లాన్ చేసిన బోయపాటి శ్రీను

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వస్తోన్న 'RAPO 20' పై ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా టీజర్ ను మే 15న రామ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది

FOLLOW US: 
Share:

RAPO 20 : ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘బోయపాటి రాపో’ అనే టైటిల్ ను ఖరారు చేసిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా టీజర్ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. మే 15న ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయాలని చిత్ర నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
 
 రామ్ పోతినేని నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘బోయపాటి రాపో’(సినిమా అసలు పేరు ఇంకా వెల్లడి కాలేదు) చిత్రంలో పెళ్లి సందడి మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక 'RAPO 20' సినిమాతో బోయపాటి - థమన్ ల కాంబో మళ్లీ రిపీట్ కానుంది. థమన్ ఈ సినిమాకు సౌండ్‌ట్రాక్‌లను అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో రామ్.. దున్నపోతును లాక్కుని వెళుతున్నట్లు కనిపిస్తోంది. అది సినిమాలోని బుల్ ఫైటింగ్ సీనులోని స్టిల్ అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఫైట్ సీన్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

యాక్షన్ అండ్ ఫైట్ సీన్స్ ను తీయడంలో దిట్ట అయిన బోయపాటి.. ఈ బుల్ ఫైట్ ను దాదాపు 11రోజుల పాటు తీశారని సమాచారం. దానికి భారీ ఖర్చు అయ్యిందని, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని టాక్. అంతే కాదు ఈ  బుల్ ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ లైట్స్ ఉపయోగించారని, దీన్ని హైదరాబాదులోని ఓ ప్రయివేట్ స్టూడియోలో తీసినట్టు తెలుస్తోంది. దాంతో పాటు ఈ సీన్ కోసం 28 జెనరేటర్లు అవసరం అయ్యాయని, స్టూడియోలో సరిపడా జనరేటర్లు లేకపోవడంతో బయట నుంచి తెప్పించారనే ఇంట్రస్టింగ్ వార్త కూడా వైరల్ అవుతోంది.

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ పై మేకర్స్ ఇచ్చిన ఇంట్రస్టింగ్ అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 15, 2023న స్టార్ హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా 'RAPO 20' టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. టైటిల్‌ కూడా ఆ రోజు అనౌన్స్ చేయనున్నారు. 

Also Read : మాస్ ఉస్తాద్ వచ్చేశాడు - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే, రచ్చ రచ్చే!

ఇదిలా ఉండగా.. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తోన్న ఈ మూవీ.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. 'RAPO 20' ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 20, 2023న ఇతర భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ తో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇందులో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 

Published at : 11 May 2023 02:05 PM (IST) Tags: Boyapati Srinu Teaser Release Ram Pothineni Boyapati Rapo RAPO 20 Bull Fighting

సంబంధిత కథనాలు

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !