అన్వేషించండి

Ram Gopal Varma: అది చూసి వెక్కివెక్కి ఏడ్చాను - రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma: మామూలుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఎప్పుడు చిల్ అవుతూ ఉంటారని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఆయన విపరీతంగా ఏడ్చిన ఒక సందర్భాన్ని తాజాగా బయటపెట్టారు.

Ram Gopal Varma: టాలీవుడ్‌లోని కాంట్రవర్షియల్ దర్శకుడు అని ట్యాగ్ ఎవరికి ఇవ్వాలి అంటే చాలామంది మూవీ లవర్స్ రామ్ గోపాల్ వర్మ పేరే చెప్తారు. తనకు నచ్చింది చేయడం, నచ్చినట్టే ఉండడం, ఎవరు ఏమన్నా పట్టించుకోకపోవడం.. ఇవన్నీ రామ్ గోపాల్ వర్మలోని స్పెషల్ లక్షణాలు. అందరికీ అలా ఉండాలని అనిపించినా ఉండలేరు, కానీ లైఫ్ అంటే ఆర్జీవీదే అని ప్రేక్షకులు అనుకోవడం మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అలాంటి ఆర్జీవీకి బాధ ఉండదా అని అడిగితే ఆయన ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తన జీవితంలో ఎక్కువగా బాధపడి ఏడ్చిన సందర్భాన్ని బయటపెట్టారు.

సైకాలజీ అలాగే ఉంటుంది..

ముందుగా మీలో రాము, ఆర్జీవీ అని రెండు పర్సనాలిటీలు ఉన్నాయి అంటూ ఒక ఫ్యాన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దానిపై వర్మ స్పందించారు. ‘‘రెండు పర్సనాలిటీలు లాంటివి ఏం లేవు. ఆ విషయంలో మీరు తప్పు. మామూలుగా ఒక విషయంలో నేను చాలా ఎమోషనల్ అవ్వచ్చు. కానీ వెంటనే అయిదు నిమిషాల్లో నేను ఇంకేదో పనిచేస్తుంటాను. చిరుత వచ్చి జింకను తినేస్తే అయ్యో జింక అనుకుంటాం. అదే హైనా వచ్చి చిరుతను తరిమేస్తే చిరుతను చూసి జాలిపడతాం. సెంటిమెంట్ సైకాలజీ అలాగే తిరుగుతూ ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు ఆ సెంటిమెంట్ ట్రాప్‌లో పడినా.. వెంటనే బయటికి వచ్చేస్తాను’’ అంటూ బాధపడడంపై తన సిద్ధాంతాన్ని బయటపెట్టారు ఆర్జీవీ.

నేను కూడా అంతే..

ఎప్పుడైనా ఏడ్చారా అని రామ్ గోపాల్ వర్మను అడగగా.. ‘‘నేను ఏడుస్తాను. కానీ నా ఏడుపు ఉండేది చాలా తక్కువసేపే. ఉదాహరణకు అయన్ ర్యాండ్‌పై తెరకెక్కించిన ‘ఏ సెన్స్ ఆఫ్ లైఫ్’ అనే డాక్యుమెంటరీ చూశాను. అది అయిపోయేసరికి నేను విపరీతంగా ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నానో కూడా అర్థం కాలేదు. అక్కడ ఏం ట్రాజిడీ జరగడం లేదు. ఏడ్చే అంత విషయం ఏమీ లేదు అందులో. కానీ తను నాకు చాలా నచ్చింది. అది నన్ను చాలా సంతోషపెట్టింది. అలాంటి ఒక మనిషి ఒకప్పుడు ఈ భూమిపై ఉంది అనేది నాపై చాలా ఎఫెక్ట్ చూపించింది. నేను రియాక్ట్ అయితే అలా ఉంటుంది. ఎమోషన్ అనేది నీ సెన్సేస్‌ను మర్చిపోయేలా చేసేదే తప్పా ఇంకేమీ కాదు. మీరు అది ఫీల్ అవ్వడానికి ఇష్టపడతారు. నేను కూడా అంతే’’ అంటూ తను ఏడ్చిన సందర్భాన్ని బయటపెట్టారు ఆర్జీవీ.

‘వ్యూహం’పై ఫోకస్..

ఒకప్పుడు ఎన్నో క్లాసిక్ హిట్ సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌లాగా మారిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కౌంటర్లు వేస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే తను డైరెక్ట్ చేసిన ‘వ్యూహం’ అనే చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరీ 23న ‘వ్యూహం’ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో అజ్మల్ అమీర్.. వైఎస్ జగన్ పాత్రలో కనిపించనున్నాడు. తన భార్య భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించింది. ధనుంజయ్ ప్రభూన్, సురభి ప్రభావతి, రేఖ సురేఖ, వాసు ఇంటూరి, కోటా జయరాం వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: స్మశానవాటికలో టీజర్ లాంచ్ - ఇదెక్కడి మాస్ ప్లానింగ్ మావా బ్రో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP DesamKarun Nair Historic Comeback vs MI | ఓటమి ఒప్పుకోని వాడి కథ..గెలుపు కాళ్ల దగ్గరకు రావాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
Telangana Congress: మంత్రి పదవి ఇవ్వకపోతే తిరుగుబాటే - సంకేతాలిచ్చిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
మంత్రి పదవి ఇవ్వకపోతే తిరుగుబాటే - సంకేతాలిచ్చిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
300 Kg Drugs Seized: గుజరాత్ తీరంలో 1800 కోట్ల రూపాయల విలువైన 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరంలో 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం, వాటి విలువ ఎంతో తెలుసా ?
KTR News: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
Salman Khan: కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం - కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం - కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
Embed widget