అన్వేషించండి

Ram Gopal Varma: అల్లు అర్జున్ అరెస్ట్‌పై అధికారులకు వర్మ ప్రశ్నలు... దేవుళ్లకు, రాజకీయ నేతలకు ముడి పెట్టేశాడుగా

పుష్ప 2 ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శుక్రవారం అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్‌ని సినీ ఇండస్ట్రీ ఖండించగా, వర్మ కొన్ని ప్రశ్నలు సంధించారు.

గత మూడు, నాలుగు రోజులుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది మంచు ఫ్యామిలీ. ఆ గొడవ కాస్త సద్దుమణిగింది అనుకుంటే.. శుక్రవారం అల్లు అర్జున్ టాలీవుడ్‌ని ఆవహించేశాడు. ఆయన నటించిన ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4 రాత్రి, హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో నిర్వహించిన ప్రీమియర్‌కు అల్లు అర్జున్ హాజరవగా.. అక్కడ తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది. అతని కుమారుడు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. ఈ ఘటనపై మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. మొదట ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా.. తర్వాత ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ అరెస్ట్‌పై ఫస్ట్ టైమ్ ఇండస్ట్రీలో కదలిక వచ్చింది. మరీ ముఖ్యంగా క్రియేటివ్ జీనియస్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఎక్స్ వేదికగా సంధించిన ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

వర్మ ప్రశ్నల గురించి మాట్లాడుకునే ముందు.. నాలుగు రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు తారా స్థాయికి చేరి, ఒక జర్నలిస్ట్‌పై మోహన్ బాబు చెయ్యి చేసుకునే పరిస్థితి నెలకొన్నా కూడా.. ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ స్పందించలేదు. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం.. నేషనల్ అవార్డ్ గ్రహీతని అరెస్ట్ చేస్తారా? అంటూ అటు పొలిటికల్, ఇటు సినీ సర్కిల్స్‌లో బీభత్సమైన స్పందన వచ్చింది. సినీ ప్రముఖులు కొందరు అల్లు అర్జున్ ఇంటికి చేరి మరీ వాళ్లకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మరీ మంచు ఫ్యామిలీ ఇంటికి ఎందుకు వెళ్లలేదు? అనేలా ఓ వర్గం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండగా.. మంచు, మెగాకు తేడా ఇదే అనేలా మరికొందరు ఆన్సర్ చేస్తున్నారు. 

మరోవైపు అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఈ మధ్య ఎటువంటి వాతావరణం నెలకొని ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బన్నీ, మెగాకి దూరం జరుగుతూ.. తన ఓన్ ఐడింటిడీ‌ని చూపించే ప్రయత్నాల్లో చేస్తున్న కొన్ని చర్యలు మెగాకి ఆగ్రహాన్ని తెప్పించాయి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అనగానే.. మెగాస్టార్ చిరంజీవి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి పరుగుపరుగున అల్లు అరవింద్ ఇంటికి వచ్చేశారు. అలాగే నాగబాబు కూడా. అంటే ఇక్కడ మరోసారి మెగా, అల్లు బంధం ఎలా ఉంటుందో వాళ్లు క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇక వర్మ విషయానికి వస్తే.. ఆయన సంధించిన ప్రశ్నలు ఇవే. 

Also Readమిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?

అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు 
1. పుష్కరాలు, బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే  దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా?
2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా?
3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా?
4. భద్రత ఏర్పాట్లు  పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులూ ఎలా  కంట్రోల్ చెయ్యగలరు?.. ఇవి వర్మ తన ఎక్స్ పోస్ట్‌లో సంధించిన ప్రశ్నలు. నిజంగా వర్మ అడిగే ప్రశ్నలు చాలా అర్థవంతమైనవే కానీ.. వాటికి సమాధానం ఇచ్చే వారు ఎవరు? ఈ క్రియేటివ్ జీనియస్.. తన క్రియేటివిటీని ఈ మధ్యకాలంలో ఉపయోగించిన విధానం ఆయనకున్న ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ అయ్యేలా చేసింది. ఓ పెగ్గు వేసి ఏదో రాశాడులే.. అనుకునే వారే తప్ప.. ఇప్పుడాయన ఏం చెప్పినా పెద్దగా పట్టించుకునే వారు కూడా లేరు. మరి ఎందుకు ఈ ప్రయాస వర్మా? ఓహో.. అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేశాడనా? బుద్ధి చూపించుకున్నావ్‌గా..

Also Read: Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget