అన్వేషించండి

Ram Charan Upasana Baby Function : మెగా ఫ్యామిలీలో నేడు పండుగ - మెగా ప్రిన్సెస్‌కు బుల్లి సంబరం, విశేషం ఏమిటంటే?

కొణిదెల కుటుంబంలో పది రోజుల క్రితం పండంటి ఆడ బిడ్డ అడుగు పెట్టింది. ఈ రోజు ఆ ఫ్యామిలీకి, పాపకు మరింత స్పెషల్ కాబోతోంది. ఎందుకు? అంటే...

మెగాస్టార్ ఫ్యామిలీకి ఈ రోజే స్పెషల్ డే! ఎందుకో తెలుసా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana Konidela) దంపతులు పది రోజుల క్రితం తల్లిదండ్రులు అయ్యారు. ఈ సంగతి అందరికీ తెలుసు. మెగాస్టార్ ఇంట మహాలక్ష్మి అడుగు పెట్టిందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కొణిదెల, కామినేని కుటుంబాలు చిన్నారి రాకతో సంతోషంలో మునిగాయి. ఈ రోజు మరో సంబరానికి సిద్ధం అయ్యాయి. 

మనవరాలిని ఉయ్యాలలో వేస్తున్న మెగాస్టార్!
రామ్ చరణ్, ఉపాసన దంపతుల బిడ్డకు 'మెగా ప్రిన్సెస్' అని ఆల్రెడీ అభిమానులు ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు. ఈ రోజు మెగా ప్రిన్సెస్ కోసం ఓ ఫంక్షన్ చేస్తున్నారు. మనవరాలిని మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలలో వేస్తున్నారు. అదీ సంగతి! 

సాధారణంగా చిన్నారి పుట్టిన 21వ రోజున బారసాల వేడుక చేస్తారు. ఆ రోజు బిడ్డను ఉయ్యాలలో వేయడం, పేరు పెట్టడం (నామకరణం) చేస్తారు. చిరు మనవరాలు జన్మించి పది రోజులు మాత్రమే అయ్యింది. ఈ రోజు ఉయ్యాలలో వేసి, 21వ రోజున నామకరణం చేస్తారేమో!?

పాపకు ఆల్రెడీ పేరు పెట్టేశారు!
అపోలో ఆస్పత్రిలో ఉపాసన డెలివరీ జరిగింది. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళే ముందు రామ్ చరణ్, ఉపాసన దంపతులు పాపతో సహా మీడియా ముందుకు వచ్చారు. పాప ముఖాన్ని కనపడకుండా జాగ్రత్త పడ్డారు. అప్పుడు పాపకు ఆల్రెడీ పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. నామకరణం రోజున పేరును చెబుతామని రామ్ చరణ్ తెలిపారు. 'పాపది ఎవరి పోలిక?' అని ప్రశ్నించగా... ''నాన్నలా ఉంది'' అని చెప్పారు.

Also Read 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ : తమన్నా బోల్డ్‌గా చేశారు సరే సిరీస్‌ ఎలా ఉంది? శృంగారం గురించి కొత్తగా ఏం చెప్పారు?

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు బిడ్డ జన్మించిన రోజున మెగాస్టార్ చిరంజీవి మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. హనుమంతునికి ప్రీతికరమైన రోజు మంగళవారం. ఆ రోజు అమ్మాయి పుట్టడంతో మెగాస్టార్ మరింత సంబరపడ్డారు. తన ఆనందం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ విజయాలు, వరుణ్ తేజ్ నిశ్చితార్థం, మనవరాలు పుట్టడం... తమ ఇంట అన్నీ శుభకార్యాలు జరుగుతున్నాయని తెలిపారు.    

పాప పుట్టిన తర్వాత మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా అపోలో ఆస్పత్రికి క్యూ కట్టారు. ఆల్మోస్ట్ మెగా కజిన్స్ అందరూ బిడ్డను చూసి వచ్చారు. అల్లు అరవింద్ దంపతులు సైతం మనవరాలిని చూశారు. సోషల్ మీడియాలో చాలా మంది రామ్ చరణ్, ఉపాసనకు శుభాకాంక్షలు చెప్పారు. అపోలో ఆస్పత్రి దగ్గర అభిమానులు బ్యాండ్ బాజాలతో డ్యాన్సులు చేశారు. 'మెగా ప్రిన్సెస్' హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.  

Also Read 'స్పై' సినిమా రివ్యూ : నిఖిల్ గురి ఎక్కడ తప్పింది? ఎందుకు తేడా కొట్టింది?

'ఆర్ఆర్ఆర్'తో గత ఏడాది భారీ విజయం అందుకోవడం మాత్రమే కాదు, గ్లోబల్ ఆడియన్స్ కాంప్లిమెంట్స్ అందుకున్న రామ్ చరణ్... సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్, అగ్ర నిర్మాత 'దిల్' రాజుతో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు. ఇప్పుడీ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇది పాన్ ఇండియా సినిమా. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. కన్నడ దర్శకులు ప్రశాంత్ నీల్, నర్తన్ దర్శకత్వంలో కూడా ఆయన సినిమాలు చేసే అవకాశం ఉంది. చర్చలు జరుగుతున్నాయి. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget