'సామజవరగమన'తో జూన్ 29న శ్రీవిష్ణు థియేటర్లలోకి వస్తున్నారు. ఈ సినిమాలో ప్లస్, మైనస్‌లు ఏంటి? మినీ రివ్యూ చూడండి.

కథ : డిగ్రీ పాసైతేనే పిల్లలకు ఆస్తి చెందేలా బాలు (శ్రీవిష్ణు) తాత వీలునామా రాసి చనిపోతారు. 30 ఏళ్లుగా ఆస్తి వచ్చింది లేదు.

పరీక్ష హాలులో తండ్రి (నరేష్)కి పరిచయమైన సరయు (రెబా మోనికా జాన్)తో బాలు ప్రేమలో పడతాడు.

సరయుతో ప్రేమకు బాలు ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అమ్మాయి ఇంట్లో విషయం చెప్పేలోపు ఓ సమస్య వస్తుంది. 

బాలు బావకు కుదిరిన పెళ్లి కారణంగా సరయు చెల్లెలు వరుస అవుతుంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కారు అనేది సినిమా. 

ఎలా ఉంది? : కథ కంటే కామెడీని నమ్ముకుని తీసిన సినిమా 'సామజవరగమన'. ఫన్ వర్కవుట్ అయ్యింది.

ఇంటర్వెల్ ట్విస్ట్ సర్‌ప్రైజ్ చేస్తుంది. క్లైమాక్స్ ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కథలో విషయం తక్కువ.

కెమెరా వర్క్, ఆర్ట్ డైరెక్షన్ బాగున్నాయి. డైలాగ్స్ ట్రెండీగా ఉన్నాయి. టెక్నికల్ టీం మంచి అవుట్ పుట్ ఇచ్చింది. పాటలు ఓకే.

శ్రీవిష్ణు, నరేష్ మధ్య సీన్లు, ఆ కెమిస్ట్రీ కేక. బాగా నవ్వించారు. రెబాతో శ్రీవిష్ణు సీన్లు కూడా బావున్నాయి. 

రెండు గంటలు హాయిగా నవ్వుకునే సినిమా 'సామజవరగమన'. టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ కావచ్చు.  

Thanks for Reading. UP NEXT

నటి రాధ కూతురు కార్తీక, ‘బిగ్ బాస్’ బ్యూటీ మోనాల్ ఫ్రెండ్సా?

View next story