అన్వేషించండి

Ram Charan: రామ్ చరణ్ షార్ట్ ట్రిప్ - చెన్నైలో రెండు రోజులు ఏం చేస్తారంటే?

Game Changer Movie Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ చేస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. 'దిల్' రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ అప్డేట్ ఏమిటంటే?

Ram Charan's Game Changer Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. సౌత్ ఇండియన్ స్టార్ ఫిల్మ్ మేకర్, నార్త్ ఇండియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... 

చెన్నైలో రెండు రోజుల పాటు షార్ట్ షెడ్యూల్
రామ్ చరణ్ ఇవాళ (మే 1న) చెన్నై ప్రయాణం అవుతున్నాడు. ఇది షార్ట్ ట్రిప్ అని తెలిసింది. రేపటి (మే 2వ తేదీ) నుండి స్టార్ట్ కాబోయే 'గేమ్ ఛేంజర్' చిత్రీకరణలో ఆయన జాయిన్ అవుతారు. అలాగని, ఇదేమీ పెద్ద షెడ్యూల్ కాదు. జస్ట్... రెండు రోజులు పాటు చేసే షార్ట్ షెడ్యూల్. గురు, శుక్ర వారాల్లో షూటింగ్ కంప్లీట్ చేసి మళ్లీ హైదరాబాద్ వస్తాడు రామ్ చరణ్.

షూటింగ్ కంప్లీట్ స్టేజికి వచ్చిన 'గేమ్ ఛేంజర్'
'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఫైనల్ స్టేజికి వచ్చిందని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 'ఒకే ఒక్కడు', 'భారతీయుడు' తరహాలో శంకర్ సోషల్ మెసేజ్ ఉన్న స్టోరీ రెడీ చేశారు. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఆ మధ్య విడుదల చేసిన 'జరగండి...' పాటకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా వైరల్ అయ్యింది.

Also Read: ఎన్టీఆర్ కోసం భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్ - ఇయర్ ఎండ్ నుంచి అసలు కథ షురూ!


రామ్ చరణ్ జోడీగా ప్రజెంట్ జనరేషన్ స్టోరీలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ యాక్ట్ చేసింది. తెలుగులో ఆమెకు థర్డ్ మూవీ ఇది. చరణ్ సరసన సెకండ్ మూవీ. ఇంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబుకు జంటగా 'భరత్ అనే నేను' చేసింది. ఆ తర్వాత 'వినయ విధేయ రామ'లో యాక్ట్ చేసింది. ఇప్పుడు మరొక సారి  చరణ్ మూవీ చేస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే తెలుగు అమ్మాయి అంజలి యాక్ట్ చేస్తోంది.

Also Readప్రభాస్ మాస్ సాంగ్ చేస్తే... ముగ్గురు హీరోయిన్లతో చిందేస్తే... థియేటర్లలో స్క్రీన్లు చిరిగిపోవూ, కుర్చీలు విరిగిపోవూ!


'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ హీరోగా నటిస్తున్న సినిమా కావ‌టంతో 'గేమ్ ఛేంజ‌ర్' మీద భారీ అంచనాలు వున్నాయి. ఈ మూవీ కోసం మెగా అభిమానులు, పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఎస్.జె. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'గేమ్ ఛేంజర్' చిత్రానికి కథ: కార్తీక్ సుబ్బరాజు, మాటలు: సాయి మాధవ్ బుర్రా, ఛాయాగ్రహణం: తిరుణ్ణావుక్కరసు, సంగీతం: తమన్, సమర్పణ: శ్రీమతి అనిత, నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - జీ స్టూడియోస్, నిర్మాతలు: 'దిల్' రాజు - శిరీష్, దర్శకత్వం: శంకర్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

LK Advani: అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
Prabhas: ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
35 Chinna Katha Kaadu: ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LK Advani: అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
Prabhas: ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
35 Chinna Katha Kaadu: ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
Chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు - రేపు ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ!
ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు - రేపు ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ!
Hemant Soren: మళ్లీ ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్ సోరెన్‌, రాజీనామా చేయనున్న చంపై సోరెన్
మళ్లీ ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్ సోరెన్‌, రాజీనామా చేయనున్న చంపై సోరెన్
Pawan Kalyan: నా స్థలంలో బైక్ రేస్‌లు చేస్కోండి, ఇలా మాత్రం చేయొద్దు - పవన్ కల్యాణ్ సరదా వ్యాఖ్యలు
నా స్థలంలో బైక్ రేస్‌లు చేస్కోండి, ఇలా మాత్రం చేయొద్దు - పవన్ కల్యాణ్ సరదా వ్యాఖ్యలు
White Paper on Amaravati :  ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతాం - వెంటనే అమరావతి పనులు - శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు
ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతాం - వెంటనే అమరావతి పనులు - శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు
Embed widget