![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం - ప్రముఖ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ప్రకటన
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ యూనివర్సిటీ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్నారు. దీంతో చరణ్‌కు ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
![Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం - ప్రముఖ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ప్రకటన Ram Charan to Receive Honorary Doctorate From Vels University in Chennai Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం - ప్రముఖ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ప్రకటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/11/a9d9f883e3754ed118ba0ddf3dc93fe81712836437616929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ram Charan Honoured Doctorate From Vels University: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు చరణ్. ఈ సినిమాతో 'గ్లోబల్ స్టార్' అనే బిరుదుని తన పేరు పక్కన చేర్చుకున్నాడు. తాజాగా ఇప్పుడు డాక్టరేట్ అనే బిరుదును కూడా అందుకోబోతున్నాడు. ప్రముఖ యూనివర్సిటీ నుంచి చరణ్ గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్నాడు. చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ తాజాగా చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 13న వెల్స్ యూనివర్సిటీలో జరుగునున్న విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకల్లో చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ డాక్టరేట్‌ని అందుకోనున్నట్టు కోలీవుడ్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
Global Star @AlwaysRamCharan will be honored with a doctorate at Vels University, Chennai on April 13th. 👏👏#RamCharan pic.twitter.com/53qLNBAO8U
— Thyview (@Thyview) April 11, 2024
ఈ కథనాల ప్రకారం కళారంగంలో అతడు అందించిన సేవలకు గానూ డాక్టరేట్‌తో వేల్స్ యూనివర్సిటీ చరణ్‌ను సత్కరించనుంది. ఈ నెల 13న జరిగే స్నాతకోత్సవ వేడుకులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTC) అధ్యక్షుడు డీజీ సీతారాం ఈ కార్యక్రమంలో పాల్గొని చరణ్‌కు డాక్టరేట్ అందించనున్నారని సమాచారం. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతున్నారు. తమ అభిమాన హీరో ఇంతటి గౌరవం దక్కడంపై అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్‌కు సోషల్ మీడియా వేదిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ కార్యక్రమానికి రామ్ చరణ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం హజరుకానున్నట్టు తెలుస్తోంది.
Today's Headline :
— Trends RamCharan ™ (@TweetRamCharan) April 11, 2024
Ramcharan was awarded an honorary doctorate at the University of Wales Convocation, Chennai !
The Convocation will take place on 13th & @AlwaysRamCharan will be the Special guest 🦁🔥 pic.twitter.com/R5v8XXQjc5
గేమ్ ఛేంజర్, #RC16తో బిజీ
ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'గేమ్ ఛేంజర్' మూవీలో నటిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీ తెరకెక్కిస్తుండంలో 'గేమ్ ఛేంజర్'పై ఇటూ తెలుగు, కోలీవుడ్‌లో బజ్ నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీపై దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు మూవీ టీం సన్నాహాలు జరుపుతుంది. ఇక శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో దిల్ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఇక అంజలీ, ఎస్‌జే సూర్య, సముద్రఖని, జయరామ్, సునీల్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు చరణ్ మరో పాన్ ఇండియా మూవీని కూడా పట్టాలేక్కించాడు. 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వలో ఆర్‌సీ16(#RC16) మూవీ తెరకెక్కునుంది. ఇటీవల ఈ చిత్రం పూజ కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఇందులో చరణ్ సరసన అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)