Vaitla Macho Movie Title: పెళ్లిలో అందరినీ చంపేసి బిర్యానీ తిన్నాడు - గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ టైటిల్ ఇదే, ఫస్ట్ స్ట్రైక్ వీడియో చూశారా?
గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ స్ట్రైక్ వదిలింది మూవీ టీం. ఇందులో మాచో స్టార్ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నాడు.
Gopichand And Srinu Vaitla movie titled Viswam: మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో హై వోల్డేజ్ యాక్షన్ ఎంటనర్‌గా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. గోపిచంద్32(#Gopichand32) వర్కింగ్ టైటిల్‌లో అనౌన్స్ చేసి షూటింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇది వైట్లమాచో(#VaitlaMacho)గా మారింది. ఇందులో మునుపెన్నడు చూడిని గోపిచంద్‌ని చూస్తారని, ఫుల్ యాక్షన్ మోడ్‌లో మాచో స్టార్ కనిపించబోతున్నాడంటూ ముందు మూవీ టీం చెబుతూ వస్తుంది. అయితే ఇప్పటికే ఈ మూవీ టైటిల్ కానీ, అప్‌డేట్ కానీ లేదు.
దీంతో గోపిచంద్ ఫ్యాన్స్ అంతా ఈ మూవీ అప్‌డేట్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా మూవీ టీం ఓ క్రేజీ అప్‌డేట్ వదిలింది. ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ స్ట్రైక్ వదిలారు మేకర్స్. ఈ సినిమాకు విశ్వం అనే టైటిల్ ఖరారు చేసి ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ స్టైక్ గోపిచంద్ సరికొత్త లుక్‌లో కనిపించాడు. ఫుల్ కోట్, హుటితో గిటార్ పట్టుకుని అలా స్టైలిష్ నడుచుకుంటూ వస్తున్నాడు గోపిచంద్. ఈ సందర్భంగా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ ఫస్ట్ స్ట్రైక్‌ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకువెళ్లింది. ఇందులో గోపిచంద్ సరికొత్త లుక్‌లో కనిపించాడు. ఈ మూవీ టైటిల్ బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం 'విశ్వం' ఫస్ట్ స్టైక్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.
శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్
ఈ ఫస్ట్ స్ట్రైక్‌లో మొత్తం కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగింది. అక్కడ ఓ పెళ్లి వేడుకు జరుతుండగా గోపిచంద్ ఎంట్రీ ఇస్తుంటాడు. ఫుల్ కోట్, హుడి ధరించి కళ్లద్దాలు ధరించాడు. అలాగే గిటార్ బ్యాగ్‌తో కనిపించిన గోపిచంద్ ఆ పెళ్లికి వేడుక దగ్గరి వచ్చాడు. గిటార్ బ్యాగ్ తీసిన గోపిచంద్ ఒక్కసారిగా తుపాకి ఫైర్‌తో విజృంభించాడు. పెళ్లి కొడుకుతో సహా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కాల్చిచంపాడు. ఇక ఫస్ట్ స్టైక్‌లోనే ఇంతటి వయైలెన్స్ చూపించి మూవీ ఆసక్తిని పెంచాడు శ్రీను వైట్ల. ఈ ఫస్ట్ సింగిల్‌లో శ్రీనువైట్ల మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత ఈ మాస్, యాక్షన్ డైరెక్టర్ 'విశ్వం' కంబ్యాక్ ఇచ్చాడనిపిస్తుంది. ఇక గోపిచంద్‌కు ఈసారి బాక్సాఫీసు వద్ద గురి తప్పదు అనేట్టుగా ఉంది విశ్వం ఫస్ట్ స్ట్రైక్. ముందు నుంచి మూవీ టీం చెప్పినట్టుగా ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్‌తో ఉండబోతుందని ఈ వీడియో అర్థమైపోతుంది.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు. మారుతున్నారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ తన పీపుల్ మీడియా ఫ్యాక్టరీని ఈ సినిమా నిర్మాణంలో భాగం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీను వైట్లతో కలిసి పలు బ్లాక్ బస్టర్స్ సినిమాలకి వర్క్ చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కెమెరామెన్ కెవి గుహన్ సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తుండగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.