By: ABP Desam | Updated at : 06 Sep 2023 06:50 PM (IST)
Photo Credit : Ram Charan/Instagram
సుమారు మూడేళ్ల విరామం తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ గురువారం, సెప్టెంబర్ 7న థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుదల అవుతోంది. యంగ్ హీరో నవీన్ పోలీస్ శెట్టితో అనుష్క మొదటిసారి ఈ సినిమాలో జత కట్టింది. అయితే మూవీ టీం ఈ సినిమా ప్రమోషన్స్ ని చాలా వినూత్న రీతిలో చేస్తున్నారు. సెలబ్రిటీస్‌కు ఓ చాలెంజ్‌ను విసురుతూ తమకు నచ్చిన ఫుడ్ రెసిపీని సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు #MSMP recipe challaenge పేరుతో మూవీ టీం సరికొత్త ప్రమోషన్స్ చేస్తోంది. ఇలా ప్రమోషన్ చేయడానికి ఓ రీజన్ ఉంది.
అదేంటంటే ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రను పోషించింది. అందుకే మూవీ టీం ప్రమోషన్స్ ని ఇలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా అనుష్క ముందుగా తనకు మంగళూరు చికెన్ కర్రీ, నీర్ దోశ ఇష్టమని వాటి రెసిపీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆ చాలెంజ్‌ను పాన్ ఇండియా హీరో ప్రభాస్‌కు విసిరింది. దీంతో తనకిష్టమైన రొయ్యల పులావ్ రెసిపీని ప్రభాస్ షేర్ చేశారు. ఇక ప్రభాస్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి #MSMP recipe challaenge విసిరారు. దీనికి తాజాగా రామ్ చరణ్ స్పందించారు. ప్రభాస్ విసిరిన #MSMP recipe challaenge ను రామ్ చరణ్ స్వీకరించి తనకు ఇష్టమైన ఫుడ్ చేపల పులుసు అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
I'm up for the challenge & here's my entry for the #MSMPRecipeChallenge.
— Ram Charan (@AlwaysRamCharan) September 6, 2023
my favorite #ChepalaPulusu
I invite @RanaDaggubati to join the fun :))
Here’s wishing the team of #MissShettyMrPolishetty all the very best for tomorrow's release.@MsAnushkaShetty @NaveenPolishety… pic.twitter.com/rQxWYldXpj
ఈ మేరకు నెల్లూరు చేపల పులుసు రెసిపీని పోస్ట్ చేశారు చరణ్. ఆ తర్వాత దగ్గుబాటి హీరో రానా ని ఈ చాలెంజ్ లోకి ఆహ్వానించారు." నేను ఛాలెంజ్ ని తీసుకున్నా #MSMP recipe challaenge లోకి ఇదేనా ఎంట్రీ. నా ఫేవరెట్ చేపల పులుసు. ఈ ఫన్ లో జాయిన్ అవ్వాలని రానా దగ్గుబాటిని నేను ఆహ్వానిస్తున్నా. రేపు రిలీజ్ కాబోతున్న మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్ర టీం కి ఆల్ ది వెరీ బెస్ట్" అంటూ రాంచరణ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా నెల్లూరు చేపల పులుసు రెసిపీ పూర్తిగా ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ ఇచ్చిన ఈ చాలెంజ్ ని దగ్గుబాటి రానా స్వీకరిస్తాడా? లేదా అనేది చూడాలి.
ఇక 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా విషయానికొస్తే.. ఓ డిఫరెంట్ జోనర్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడం, నవీన్ పోలిశెట్టితో మొదటిసారి ఆమె జోడి కట్టడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. పి.మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని UV క్రియేషన్ సంస్థపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కాబోతోంది.
Also Read : అలాంటి వారెవరూ నాకు తెలియదు: మంత్రి రోజాపై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే
Raveena Tandon: ఆయన పెదాలు తాకగానే- షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రవీనా టాండన్!
Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?
Ritika Singh: ఆ ఘటన చూసి గుండె మండింది, ఇబ్బంది అనిపించినా అమ్మాయిలకు వాటిని నేర్పించాల్సిందే
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
Motkupalli Meets Shivakumar : డీకే శివకుమార్‌ను కలిసిన మోత్కుపల్లి - కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారా?
Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!
/body>