అన్వేషించండి

Kangana Ranaut: అలాంటి వారెవరూ నాకు తెలియదు: మంత్రి రోజాపై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్

కంగనా రనౌత్ చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీలను క్రియేట్ చేసే విధంగా ఉంటాయని.. బాలీవుడ్ అంతా తనను వెలేసింది.

కొన్నిసార్లు సెలబ్రిటీలు అనుకోకుండా చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తాయి. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం కోసమే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి సినీ సెలబ్రిటీలలో కంగనా రనౌత్ ఒకరు. కంగనా ఏం మాట్లాడినా, ఏం చేసినా ఒక విధమైన సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడే మనస్థత్వం.. కంగనాను ఇప్పటికీ ఎన్నోసార్లు ఇబ్బందుల్లో పడేసింది. అయినా కూడా తన ప్రవర్తన ఏమీ మారలేదు. తాజాగా మినిస్టర్ రోజాపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది కంగనా. ప్రస్తుతం తను చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘చంద్రముఖి 2’ ప్రమోషన్స్‌లో కామెంట్స్..
కంగనా రనౌత్ చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీలను క్రియేట్ చేసే విధంగా ఉంటాయని.. బాలీవుడ్ అంతా తనను వెలేసింది. దీంతో గత కొన్నేళ్లుగా కోలివుడ్ సెలబ్రిటీలతో సన్నిహితంగా ఉంటోంది ఈ భామ. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘తలైవి’లో యాక్ట్ చేసి తమిళ ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని చూసిన కంగనా.. మరోసారి ‘చంద్రముఖి 2’తో వారి చేత ప్రశంసలు పొందాలని అనుకుంటోంది. 18 ఏళ్ల క్రితం విడుదలయిన ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 15న ‘చంద్రముఖి 2’ విడుదలకు సిద్ధమవుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అలా తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో రోజాపై కంగనా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రోజా ఎవరో తెలియదు..
రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అంటూ ఓ జర్నలిస్ట్.. కంగనాను ప్రశ్నించారు. దానికి అవును అని సమాధానం ఇచ్చింది కంగనా. అయితే ఒకప్పుడు మంత్రి రోజా.. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ‘రాజకీయాల్లోకి రావాలంటే సినిమాలకు దూరం అవ్వాల్సిందే’ అన్న కామెంట్స్‌ను ఆ జర్నలిస్ట్ గుర్తుచేస్తూ.. దానిపై కంగనా స్పందన అడిగారు. అయితే రోజా అనే పేరుతో తనకు ఎవరూ తెలియదంటూ కంగనా సమాధానమిచ్చింది. దీంతో నిజంగానే కంగనాకు రోజా తెలియదా..? లేదా కావాలనే అలా కామెంట్స్ చేసిందా? అంటూ ప్రేక్షకులు సందేహిస్తున్నారు. 

జ్యోతికపై ప్రశంసలు..
‘చంద్రముఖి 2’ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న కంగనా.. ఇండియా పేరును భారత్‌గా మార్చడంపై కూడా స్పందించింది. ‘‘బ్రిటిష్ వారు మనకు ఇండియా అని పేరుపెట్టారు. దానిని భారత్ అని మార్చాలని నేను రెండు, మూడేళ్ల క్రితమే చెప్పాను’’ అంటూ ఆ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది కంగనా. ఇక ‘చంద్రముఖి’లో జ్యోతిక నటన గురించి కూడా తనకు ప్రశ్న ఎదురయ్యింది. ‘చంద్రముఖి’లో జ్యోతిక అద్భుతంగా నటించారు. ఆ నటన చూసి నాకు కూడా అలాంటి పాత్ర చేయాలని కోరిక కలిగింది’ అంటూ జ్యోతికను, తన నటనను ప్రశంసల్లో ముంచేసింది కంగనా. పి వాసు దర్శకత్వం వహించిన ‘చంద్రముఖి 2’లో కంగనాకు జోడీగా రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ఒకప్పటి క్లాసిక్ సినిమాకు సీక్వెల్ కాబట్టి.. ఈ మూవీ ఆ రేంజ్ విజయాన్ని అందుకుంటుందా లేదా అని తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: నరేష్‌కు ముద్దు పెట్టిన పవిత్రా లోకేష్ - మీరు చూశారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
Embed widget