Ram Charan: కమెడియన్‌ను తనతో పాటు ఓన్ ఫ్లైట్‌లో హైదరాబాద్ తీసుకొచ్చిన రామ్ చరణ్
షూటింగ్స్‌కు హీరోలు వచ్చి వెళ్ళడానికి ప్రత్యేకంగా ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. మిగతా ఆర్టిస్టులకు సాధారణ ఏర్పాట్లు ఉంటాయి. అటువంటిది, హీరోతో పాటు కమెడియన్ కూడా సేమ్ ఫ్లైట్‌లో రావడం విశేషం.
కమెడియన్ సత్య ఉన్నారు కదా! అదేనండీ... 'స్వామి రారా' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. ఆయన ఒక రోజంతా 'గాల్లో తేలినట్టుందే' అంటూ సంతోషంలో తేలియాడారు. ఆ ఆనందానికి కారణం... రామ్ చరణ్!
షూటింగ్స్‌కు వచ్చి వెళ్ళడానికి స్టార్ హీరోలకు ప్రత్యేకంగా ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. మిగతా ఆర్టిస్టులకు సాధారణ ఏర్పాట్లు ఉంటాయి. ఇండియాలో రామ్ చరణ్ అవుట్ డోర్ షూటింగ్స్ చేసినప్పుడు సొంత ఫ్లైట్‌లో వెళ్లి వస్తారు. ఈ మధ్య అమృత్‌సర్‌లో RC15 షూటింగ్ చేశారు. షెడ్యూల్ ముగిసిన తర్వాత తనతో పాటు సొంత ఫ్లైట్‌లో కమెడియన్ సత్యను హైదరాబాద్ తీసుకొచ్చారు.
#RC15 లేటెస్ట్ అమృత్‌సర్ షెడ్యూల్‌లో రామ్ చరణ్ సీన్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న సత్య సన్నివేశాలు కూడా అదే రోజున కంప్లీట్ అయ్యాయి. అతడు అమృత్‌సర్ నుంచి హైదరాబాద్ రావడానికి వెయిట్ చేస్తున్నాడనే విషయం రామ్‌చరణ్‌కు తెలిసింది. అప్పుడు తనతో పాటు సొంత ఫ్లైట్‌లో తీసుకొచ్చారు. అదీ సంగతి!
Also Read : 'మాయోన్' రివ్యూ: శ్రీకృష్ణ మాయ నిజమా? కల్పితమా? ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
సత్య మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్. ఈ విషయం తెలిసిన రామ్ చరణ్ గతంలో 'రంగస్థలం' సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ ఇవ్వడమే కాకుండా... ఫ్లైట్ జర్నీలో చోటు ఇవ్వడంతో సత్య గాల్లో తేలుతున్నారు. ఈ విషయాన్ని 'గెటప్' శీను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read : థోర్ లవ్ అండ్ థండర్ రివ్యూ: ఉరుముల దొర ఆకట్టుకున్నాడా?
View this post on Instagram