అన్వేషించండి

లోకేష్ కనకరాజ్ చెప్పింది రామ్ చరణ్ గురించేనా? లియోలో కామియో అంటూ హైప్

Ram Charan: టాలీవుడ్‌లో ఓ విషయం ట్రెండింగ్‌లో ఉంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో. ఎల్‌సీయూలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా లియో.

Ram Charan: టాలీవుడ్‌లో ఓ విషయం ట్రెండింగ్‌లో ఉంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో. ఎల్‌సీయూ (లోకేస్ సినిమాటిక్ యూనివర్స్‌)లో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా లియో. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తొలి సారి లోకేష్ కనగరాజ్ సినిమాపై ట్రోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఖైదీ, విక్రమ్, ఇది వరకు ఎన్నడూ కూడా లోకేష్ సినిమాల మీద ట్రోలింగ్ జరగలేదు. ఖైదీ, విక్రమ్ సినిమాలు హిట్ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టించాయి. కానీ విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన లియో మాత్రం విడుదలకు ముందే ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. అంతకు ముందు లోకేష్ చిత్రాలు ఖైదీ, విక్రమ్, బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే లియోకు మాత్రం అటు కోలీవుడ్ నుంచి కానీ, ఇటు టాలీవుడ్ నుంచి గానీ పెద్దగా రెస్పాన్స్ లేదు. లియో పోస్టర్లు, ట్రైలర్ చూసిన అందరూ పెదవి విరిచారు.  

అసలే ఏం దొరికితే ట్రోల్ చేద్దామని కాసుకుని కూర్చున్న ట్రోలర్స్‌కు లియో ట్రైలర్‌ మంచి స్టఫ్‌ను ఇచ్చిందనే అనుకోవాలి. ట్రైలర్‌లో ప్రతి షాట్‌ను అనలైజ్ చేస్తూ రివ్యూ ఇవ్వడం ప్రారంభించారు. ట్రైలర్ చూసిన నెటిజన్లు.. హాలీవుడ్ మూవీని కాపీ కొట్టేశాడని, కథ కూడా అలానే ఉందని, యాక్షన్ సీక్వెన్స్ కూడా అలానే ఉన్నాయని అంటూ సటైర్లు వేస్తుస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ కూడా కొత్తగా ఏమీ లేదని, ఇది వరకు సినిమాల్లో చూసినట్టుగానే ఉందని ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో మొదటి సారిగా లోకేష్ కనకరాజ్ సినిమాలపై ఈ రేంజ్‌లో ట్రోల్స్ వచ్చాయి. అయితే సినిమాకు డ్యామేజ్ జరగకుండా లోకేష్ కనగరాజ్ రంగంలోకి దిగాడు. తాజాగా ఓ హింట్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ సినిమాను రాని ఓ సర్ ప్రైజ్, బయటకు చెప్పని ఓ స్పెషల్ కారెక్టర్ ఉందంటూ ఊరించాడు. అదేంటో సినిమా రిలీజ్ రోజున తెలుస్తుందని చెప్పేశాడు. 

లోకేష్ కనగరాజ్ మాటలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అయితే ఆ కారెక్టర్ కచ్చితంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌దే అని టాలీవుడ్ అభిమానులు పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే అది నిజమో కాదో తెలియాలంటే ఖచ్చితంగా లియో విడుదల వరకు ఆగాల్సిందే. గతంలో చాలా సార్లు టాలీవుడ్, కోలీవుడ్ సర్కిళ్లలో ఓ వార్త విస్తృతంగా ప్రచారం జరిగింది. అదేంటంటే ఎల్‌సీయూలో రామ్ చరణ్ ఓ పాత్ర పోషించబోతున్నాడని, టాలీవుడ్ చరిత్రను తిరగరాసేలా ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజాగా లోకేష్ వ్యాఖ్యలతో అటు టాలీవుడ్‌తో పాటు రామ్ చరణ్ అభిమానులు సైతం లియోలో రామ్ చరణ్ కామియో ఉంటుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

విక్రమ్ సినిమాలో సూర్య పాత్ర తరహాలో రామ్ చరణ్ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది. చేతిపై పాము ట్యాటూ ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ నిజమో కాదో తెలియాలంటే మాత్రం లియో విడుదల వరకు ఆగాల్సిందే.  ఇప్పటికే దసరా బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. బాలయ్య భగవంత్ కేసరి, కన్నడ శివన్న ఘోస్ట్, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియోలు బరిలోకి దిగబోతోన్నాయి. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.  ఈ నాలుగింట్లో బాలయ్య, రవితేజలవి స్ట్రెయిట్ సినిమాలు కాగా.. మిగతా రెండు డబ్బింగ్ రూపంలో రాబోతోన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget