Peddi: రామ్ చరణ్ జపాన్ ఫ్యాన్స్‌కు నిరాశ... 'పెద్ది' విడుదలలో పెద్ద ట్విస్ట్
Peddi Japan Release: ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లోనూ బాగా ఆడింది. రామ్ చరణ్ అభిమానులు ఉన్నారు అక్కడ. 'పెద్ది' విడుదల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు పిడుగు లాంటి వార్త.

రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4వ తేదీన (Peddi Release Date) థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. ప్రెస్ మీట్లు, భారీ ఈవెంట్లు... సినిమా ప్రమోట్ చేసే విషయంలో రామ్ చరణ్ నుంచి టీమ్ వరకు ఎవ్వరూ తగ్గడం లేదు. సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. జూన్ 4వ తేదీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే... 'పెద్ది' విడుదల కోసం ఎదురు చూస్తున్న జపాన్ అభిమానులకు ఓ పిడుగులాంటి వార్త ఇది.
జపాన్‌లో సేమ్ డే రిలీజ్ లేదు
Peddi Japan Release Update: 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా జపాన్ దేశంలోనూ బాగా ఆడింది. రామ్ చరణ్ నటనకు అక్కడి జనాలు ఫిదా అయ్యారు. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అది దృష్టిలో పెట్టుకుని... చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు, తొలుత ఈ చిత్రాన్ని ఇండియాతో పాటు జపాన్‌లో కూడా సేమ్ డే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. దాంతో రామ్ చరణ్ జపాన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. అయితే... విడుదలకు కొద్ది రోజుల ముందు 'పెద్ది' టీమ్ జపాన్ రిలీజ్ విషయంలో ఊహించని నిర్ణయాన్ని ప్రకటించింది. దాంతో అభిమానులకు పెద్ద షాక్ తగిలింది.
తాజా సమాచారం ప్రకారం... కొన్ని అనివార్య కారణాల వల్ల 'పెద్ది' జపాన్ రిలీజ్ క్యాన్సిల్ చేశారు. అంటే... జూన్ 4న 'పెద్ది' జపనీస్ వెర్షన్ అక్కడ విడుదల కాదు. తర్వాత రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ వార్త రామ్ చరణ్ జపాన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసింది. 'పెద్ది' విడుదల కోసం ఎదురు చూస్తున్న జపాన్‌లోని భారతీయులు కూడా ఈ నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జపాన్‌లో సేమ్ డే రిలీజ్ అయ్యి ఉంటే గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ నమోదు అయ్యేవని చెబుతున్నారు.
Peddi Cast And Crew: బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ఇతర పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు





















