Bandla Ganesh - Pawan Kalyan: సింహాన్ని నిద్ర లేపొద్దని చెప్పాం... పవన్ ఆట మొదలైంది - బండ్ల గణేష్ వైరల్ ట్వీట్
Pawan Kalyan Latest News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే గణేష్ బండ్లకు అమితమైన ఇష్టం. ఇవాళ చేసిన ట్వీట్‌లో అది మరోసారి బయటపడింది. ఏపీ రాజకీయాలపై బండ్ల గణేష్ ఏమన్నారంటే?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) అంటే నటుడు - నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh)కు అమితమైన ఇష్టం. ఈశ్వరా... పరమేశ్వరా... పవనేశ్వరా... అంటూ ఓ సినిమా వేడుకలో పవన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు మరోసారి తన అభిమాన కథానాయకుడికి వీర లెవల్ ఎలివేషన్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న ఉప ముఖ్యమంత్రిని సింహంతో పోల్చారు బండ్ల గణేష్. ఇంతకీ, ఏ విషయంలో అన్నారు? ఏమైంది? వంటి వివరాల్లోకి వెళితే...
పవన్ ఆట మొదలైంది...
అవినీతి జరిగితే సహించడు!
ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నదుల కాలుష్యంపై ఆయన దృష్టి సారించారు. ఐఏఎస్ ఆఫీసర్లకు, ప్రభుత్వ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే సమీక్షల్లో సాధారణ విషయాలు కాకుండా ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించాలని సూచించారు. ఆ వీడియోపై బండ్ల గణేష్ స్పందించారు.
''సింహాన్ని నిద్ర లేపొద్దు అని ముందే చెప్పాం… ఇప్పుడైనా అర్థమైందా? (పవన్) ఆట మొదలైంది… తప్పు జరిగితే ఈ సింహం (పవన్ కళ్యాణ్) ఊరుకోదు, అవినీతి జరిగితే సహించదు. తాను నిద్రపోదు… నిద్రపోనివ్వదు. అది సింహం నైజం... మనం ఏం చేయలేం'' అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ మీద మిశ్రమ స్పందన లభిస్తోంది. వైసీపీ అనుచరులు విమర్శలు చేస్తుండగా... జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: Ranveer Singh - తెలుగులో రణవీర్‌ను బ్యాన్ చేయలేదు... Don 3కి చేసినట్టు ప్రశాంత్ వర్మ గొడవ చేయలేదు
“సింహాన్ని నిద్ర లేపొద్దు అని ముందే చెప్పాం…
— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2026
ఇప్పుడైనా అర్థమైందా?
ఆట మొదలైంది…
తప్పు జరిగితే ఈ సింహం ఊరుకోదు,
అవినీతి జరిగితే సహించదు.
తాను నిద్రపోదు… నిద్రపోనివ్వదు.
అది సింహం నైజం…
మనమేం చేయలేం!” 🔥 @PawanKalyan sir https://t.co/hAcfFqx10d
మెగా కుటుంబానికి దగ్గరగా బండ్ల గణేష్!
పవన్ కళ్యాణ్, మెగా కుటుంబానికి బండ్ల గణేష్ ఒకప్పుడు సన్నిహితంగా మెలిగారు. అయితే మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. అయితే... ఇటీవల మళ్ళీ దగ్గరయ్యారు గణేష్. తన కుమార్తె వివాహానికి వచ్చిన చిరంజీవి కాళ్లకు నమస్కరించారు. అంతే కాదు... ఇటీవల జరిగిన చిరంజీవి, దర్శకుడు బాబీ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్, చిరంజీవితో ఫోటో దిగాలని... మెగాస్టార్‌ను రిక్వెస్ట్ చేశారు బండ్ల గణేష్. 'భగవంతునికి, భక్తునికి మధ్యలో అంబికా దర్బార్ అగర్ బత్తిలా నేను ఎందుకు?' అని చిరంజీవి చమత్కరించారు. తర్వాత ఫోటో దిగారు. ఆ వీడియో వైరల్ అయ్యింది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















