అన్వేషించండి

Peddi First Review - 'పెద్ది' ఫస్ట్ రివ్యూ: కథను మలుపు తిప్పే మరణం... చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా ఎందుకీ మిక్స్డ్ టాక్?

Peddi Review In Telugu: 'పెద్ది'లో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని ఈ సినిమాను ఆల్రెడీ చూసిన జనాలు చెబుతున్నారు. కథను ఓ మర్డర్ మలుపు తిప్పిందట. మరిన్ని విషయాలు ఫస్ట్ రివ్యూలో తెలుసుకోండి

'పెద్ది' ఈవెంట్స్ గమనిస్తే... సినిమా టీంలో ఎవరు మాట్లాడినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుతున్నారు. 'పెద్ది'లో నటనకు రామ్ చరణ్ నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందని రవి కిషన్ చెప్పారు. మరిన్ని అవార్డులు వస్తాయని చెప్పారు. మరి సినిమా ఎలా ఉంది? ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు ఏమంటున్నారు? అనేది ఫస్ట్ రివ్యూలో తెలుసుకోండి.

కథను మలుపు తిప్పే మరణం
Ram Charan Peddi First Review: 'పెద్ది' కథను దాచి పెట్టాలని దర్శకుడు బుచ్చి బాబు సానా అనుకోలేదు. రామ్ చరణ్ క్యారెక్టర్ ఏమిటి? అనేది ఆయన చెప్పేశారు. క్రికెటర్, రన్నర్, కుస్తీ వీరుడిగా... మూడు ఆటలు ఆడే వ్యక్తిగా 'పెద్ది'గాడి పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. ఉత్తరాంధ్రలో మారుమూల పల్లెలో కుర్రాడు, దేశం గర్వించదగ్గ అథ్లెట్ ఎలా అయ్యాడు? అనేది సినిమా. అయితే... అథ్లెట్ అవ్వడం కోసం 'పెద్ది' ఏం చేశాడు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

'పెద్ది' క్యారెక్టర్, కథ ఎలా ముందుకు వెళుతుంది? అనేది రివీల్ చేసిన దర్శకుడు... జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం 'పెద్ది' ఏం చేశాడు? అనేది మాత్రం చెప్పలేదు. ఈ కథలో అది కీలకమైన అంశం అని తెలిసింది. కథను ఓ మరణం మలుపు తిప్పిందని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. 

Also ReadRam Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే... ఉత్తరాంధ్రలోని మారుమూల పల్లెకు చెందిన ఓ కుర్రాడికి క్రికెట్, రన్నింగ్, కుస్తీ - మూడు ఆటల్లోనూ తిరుగు లేదు. ఆ ఊరిలో ఎవరిని అడిగినా తనకు ఇష్టమైన ఆటగాడు 'పెద్ది' అని చెబుతారు. ఆ 'పెద్ది'కి చుట్టుపక్కల గ్రామాల్లో మాత్రమే కాదు... రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ పేరు వస్తుంది. కానీ, ఆ ఊరికి గుర్తింపు మాత్రం రాదు. పైగా, ఊరిలో వివక్ష ఒకటి. ఓసారి పెద్ది ట్రోఫీ గెలిచి ట్రైనులో ఊరికి వస్తాడు. ఆ సమయంలో జరిగిన కొన్ని అనూహ్య పరిణామాల వల్ల ఓ పెద్ద మనిషి ప్రాణ త్యాగం చేస్తాడు. అది చూసి చలించిపోయిన పెద్ది... తన కాలును త్యాగం చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరుగు పందెంలో పాల్గొంటాడు. గెలిచి ఊరికి గుర్తింపు తీసుకొస్తాడు. అదీ కథ.

రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్...
కానీ సినిమాకు ఎందుకీ మిక్స్డ్ టాక్?
'పెద్ది' చూసిన యూనిట్ సభ్యులు మాత్రమే కాదు... బయట జనాలు కూడా చెప్పేది ఒక్కటే మాట. రామ్ చరణ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని. నటనతో పాటు యాక్షన్... ప్రతి సన్నివేశంలో పెర్ఫెక్షన్ చూపించారని. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. 

Also ReadPeddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?

రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని ప్రతి ఒక్కరూ చెబుతున్నా... సినిమా మీద మాత్రం కాస్త నెగిటివిటీ ఉంది. మిక్స్డ్ టాక్ వినబడుతోంది. అందుకు రీజన్ బుచ్చిబాబు సానా ఎమోషనల్ టేకింగ్ అట. సినిమా లెంగ్త్ మూడు గంటల తొమ్మిది నిమిషాలు. అందులోనూ మాస్ మూమెంట్స్ కంటే ఎమోషనల్ డ్రైవ్ ఎక్కువ. మరీ ముఖ్యంగా ముందు నుంచి చెబుతూ వస్తున్న చివరి 50 నిమిషాలు, అరగంట ఎంతో భావోద్వేగ భరితంగా ఉందట. అందువల్ల, మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వెంటనే హై ఇచ్చే యాక్షన్ ఎంటర్టైనర్ కాదని, స్లో పాయిజన్ టైపులో వెళ్లే సినిమా అని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. 

Also ReadPeddi Twitter Review - అమెరికాలో 'పెద్ది' ఫస్ట్ షో ఎప్పుడు? రామ్ చరణ్ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?

రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య లవ్ ట్రాక్, పాటలతో పాటు క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ వెళ్లడం వల్ల 'పెద్ది' ఫస్టాఫ్ సరదాగా ముందుకు సాగుతుందట. కానీ, సెకండాఫ్ వచ్చేసరికి ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువ కావడంతో డౌన్ అయినట్టు ఉంటుందట. ఏఆర్ రెహమాన్ పాటలు సినిమాలు ప్లస్ అయ్యాయని, ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బావుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. రామ్ చరణ్ తర్వాత జగపతి బాబు, దివ్యేందు శర్మ పెర్ఫార్మన్స్ గురించి ఎక్కువ మంది మాట్లాడతారట. సినిమా లెంగ్త్ విషయంలో మాత్రం డిజప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందట.

Also Read: Peddi Censor Review - పెద్ది ఫస్ట్ రివ్యూ: దుబాయ్ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది... రామ్ చరణ్ సినిమా టాక్ ఏమిటంటే?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget