Ram Charan: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలిసిన రామ్ చరణ్, ఉపాసన
Ram Charan in Mumbai: గత కొన్నిరోజులుగా రామ్ చరణ్, ఉపాసన కలిసి ముంబాయ్‌లో చక్కర్లు కొడుతున్నారు. అదే క్రమంలో తాజాగా వీరిద్దరూ కలిసి మహారాష్ట్ర సీఎం ఏక్‌రాథ్ షిండేతో సమావేశమయ్యారు.
Ram Charan - Upasana: ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. గతకొంతకాలంగా తన భార్య ఉపాసన, కూతురు క్లిన్ కారాతో కలిసి ముంబాయ్‌లో చక్కర్లు కొడుతున్నారు. ముందుగా రామ్ చరణ్ ముంబాయ్‌కు వెళ్లగా.. ఆ తర్వాత ఉపాసన కూడా కూతురితో అక్కడికి చేరుకున్నారు. అయితే అసలు రామ్ చరణ్ అక్కడికి ఎందుకు వెళ్లారు? ఇన్నిరోజులు అక్కడ ఎందుకు ఉంటున్నారు? అనే విషయాలు తెలియక ముందే చరణ్ వెళ్లి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భార్య ఉపాసనతో కలిసి ఏక్‌నాథ్ షిండే ఇంటికి వెళ్లి.. కాసేపు తనతో ముచ్చటించాడు రామ్ చరణ్.
ముంబయిలో బిజీ బిజీగా చరణ్, ఉపాసన
రామ్ చరణ్ కుటుంబమంతా ముంబాయ్‌కు చేరుకున్న తర్వాత ముందుగా మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. క్లిన్ కారా ఆరవ నెల పుట్టినరోజు సందర్భంగా వారంతా కలిసి ఆలయానికి వెళ్లారని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు. ఇక కొన్నిరోజుల తర్వాత వీరు వెళ్లి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ను కలవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కేవలం ఏక్‌నాథ్‌తో మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులు అందరితో రామ్ చరణ్, ఉపాసన ముచ్చటించారు.
తిలకం వేడుకతో పాటు హారతి
రామ్ చరణ్, ఉపాసనకు వెల్‌కమ్ చెప్పడానికి ఏకనాథ్ షిండే శ్రీకాంత్ కూడా అక్కడే ఉన్నారు. ఇంటికి స్పెషల్ గెస్టులు రావడంతో ఏక్‌నాథ్ కోడలు వృషాలి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారని సమాచారం. తిలకం వేడుకతో పాటు హారతి కార్యక్రమం కూడా నిర్వహించారట. ఈ సమావేశం కోసం డెనిమ్ షర్ట్‌లో స్టైలిష్‌గా రెడీ అయ్యారు. తన భార్య ఉపాసన ఎప్పటిలాగానే ఒక వైట్ సింపుల్ కుర్తాలో కనిపించారు. కానీ ఏక్‌నాథ్‌తో రామ్ చరణ్ జంట ఎందుకు సమావేశం అయ్యింది అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన.. తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
View this post on Instagram
పర్సనల్ పని కోసమే ముంబాయ్‌కు..
రామ్ చరణ్ ముంబాయ్‌లో ల్యాండ్ అయినప్పటి నుంచి షూటింగ్ కోసం వచ్చారేమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ చరణ్ కేవలం పర్సనల్ పనిపైనే ముంబాయ్ వెళ్లారని, కొన్నివారాల పాటు అక్కడే ఉంటారని తన టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే.. కొన్నాళ్ల పాటు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గేమ్ ఛేంజర్’కు చరణ్ కొన్నిరోజులు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ మొదలయినప్పటి నుంచి పలు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. మొదటి పాటను విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించిన మూవీ టీమ్.. ఇప్పటికీ ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ‘గేమ్ ఛేంజర్’ కోసం రెండోసారి కియారా అద్వానీతో జతకడుతున్నాడు రామ్ చరణ్. సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read: మంచి తండ్రిగా ఉండలేకపోయా, పిల్లలు ఏడ్చినప్పుడు మాత్రమే ఇంటికెళ్లేవాడిని - ప్రశాంత్ నీల్