అన్వేషించండి

RC16 Movie: రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా తమిళియన్ - ఆయన ఎవరో తెలుసా?

తమిళ సినిమా పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎగన్ ఏకాంబరం తొలిసారి తెలుగు సినిమాకు పనిచేయబోతున్నారు. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Ram Charan And Buchibabu Saana Movie ‘RC16’: ఎగన్ ఏకాంబరం... తెలుగు సినిమా అభిమానులకు పెద్దగా పరిచయం లేకపోయినా, తమిళ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితం. కోలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. రీసెంట్ గా ‘తంగాలాన్‘ చిత్రానికి ఆయనే కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. ఈ సినిమా కోసం రూపొందించిన దుస్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. తమిళ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎగన్ ఏకాంబరం... తొలిసారి తెలుగు సినిమా కోసం పని చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

‘RC 16’కి పని చేయడం సంతోషంగా ఉంది- ఎగన్ ఏకాంబరం

దర్శకుడు బుచ్చిబాబు సాన, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కనున్న ‘RC16’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తున్నట్లు ఏకాంబరం వెల్లడించారు. “తొలిసారి తెలుగు సినిమా కోసం పని చేస్తున్నారు. టాలీవుడ్ లో పని చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది. ప్రస్తుతం ఈ సినిమా పనులు కొసాగుతున్నాయి. ఇంత అద్భుతమైన అవకాశాన్ని అందించిన దర్శకుడు బుచ్చిబాబు సానకు ధన్యవాదాలు. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి పని చేసే అవకాశం రావడం పట్ల సంతోషంగా ఉంది. ఇంత కాలం తమిళం సంప్రదాయాల గురించి మాత్రమే పట్టించుకున్న నేను, ఇప్పుడు తెలుగువారి సంప్రదాయాలు వస్త్రధారణ గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ఇది నాకు మంచి ఛాన్సుగా భావిస్తున్నాను. ప్రాజెక్ట్ ‘RC16’ పని చేయడం మర్చిపోలేని అనుభూతిని మిగుల్చుతుందని భావిస్తున్నాను” అని తన ఇన్ స్టా వేదికగా రాసుకొచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aegan Ekambaram (@ekambaramaegan)

స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కనున్న ‘RC 16’

బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న ‘RC 16’కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను బుచ్చిబాబు స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో రామ్‌ చరణ్‌  సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది.

‘గేమ్ ఛేంజర్’ బిజీలో రామ్ చరణ్

ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ మూవీ రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భరీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Also Read: జానీ మాస్టర్‌కి మరో షాక్, అతడిపై పోక్సో కేసు నమోదు - డ్యాన్స్‌‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం!

టాప్ హెడ్ లైన్స్

Aasmaan First Look : శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget