మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్, ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసనా కొణిదెల జపాన్‌లో ఉన్నారు. భర్త రామ్ చరణ్, 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందంతో కలిసి ఉపాసన జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. జపాన్‌లో అక్కడి ఫేమస్ వంటకం రమేన్ లాగించారు. సాధారణంగా డైట్ ఫాలో అయ్యే ఉపాసన రమేన్ కోసం దాన్ని పక్కన పెట్టేశారు. జపాన్‌లో సుమారు 50వేలకు పైగా రెస్టారెంట్లు రమేన్ సర్వ్ చేస్తాయని, మీకు ఇష్టమైనది ఎంపిక చేసుకోమని ఉపాసన తెలిపారు. జపాన్ లో ఓ రెస్టారెంట్ ముందు ఉపాసన రమేన్ రెస్టారెంట్ నిర్వాహకులతో ఉపాసన ఫోటోలు దిగారు. భర్త రామ్ చరణ్ ఫోటో షేర్ చేసిన ఉపాసన మరో అడ్వెంచర్ మొదలైందని పేర్కొన్నారు. జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' ప్రచారం ముగించుకుని చరణ్, ఉపాసన మరో కంట్రీకి టూర్ వేస్తున్నట్లు ఉన్నారు జపాన్ లో ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, రాజమౌళి వైఫ్ రమతో ఉపాసన (All Images Courtesy : upasana instagram)