ఇప్పుడు ప్రియాంక చోప్రా ఎక్కువ సమయం అమెరికాలో ఉంటున్నారు. ఆమె భర్త నిక్ జోనాస్‌ది అమెరికానే కదా! అమెరికాలో ఉంటున్నప్పటికీ... ప్రియాంక చోప్రా తన మూలాలు, సంప్రదాయాలు మరువలేదు. భర్త నిక్ జోనాస్, అమ్మాయి మాలతితో కలిసి ప్రియాంక చోప్రా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రియాంకకు ఈ దీపావళి ఎంతో స్పెషల్ ఎందుకంటే... అమ్మాయితో సెలబ్రేట్ చేసుకున్న ఫస్ట్ దీపావళి ఇదే మరి! ఫోటోలు అయితే షేర్ చేశారు కానీ... ఎక్కడా అమ్మాయి ముఖం కనిపించకుండా ప్రియాంక జాగ్రత్త పడ్డారు. భర్త నిక్ జోనాస్, అమ్మాయి మాలతితో ప్రియాంక చోప్రా అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రియాంక చోప్రా ఇంటిలో శివుడు. దీపావళి సందర్భంగా ప్రియాంక ఇంట ప్రిపేర్ చేసిన వంటకాలు ప్రియాంక ఇంట్లో ఒక దృశ్యం (All Images Courtesy : Priyanka Chopra / Instagram)