అన్వేషించండి

Jani Master Case: జానీ మాస్టర్‌కి మరో షాక్, అతడిపై పోక్సో కేసు నమోదు - డ్యాన్స్‌‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం!

Jani Master Case: జానీ మాస్టర్‌ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ కేసు రోజుకో ట్విస్ట్‌ ఇస్తుంది. తాజాగా అతడిపై పోక్సో కేసు నమోదైంది. దీంతో జానీ మాస్టర్‌ కేసు విషయంలో డ్యాన్స్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది

స్టార్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ చూట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇటీవల ఆయనపై 21 ఏళ్ల యువతి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కొన్నేళ్లు జానీ మాస్టర్‌ తనని లైంగిక వేధిస్తున్నాడంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళా కొరియోగ్రాఫర్‌, ఢీ మాజీ కంటెస్టెంట్‌ హైదరాబాద్‌ నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్‌పై నార్సింగ్‌ పోలీసులు మొదట అతడిపై ఐపీసీ సెక్షన్‌ 376 (క్రిమినల్ బెదిరింపులు), సెక్షన్ 506 స్వచ్ఛందంగా గాయపరచడం, సెక్షన్ 323)లోని క్లాజ్ (2) అండ్ (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

పరారీలో జానీ

అయితే ఈ వ్యవహారం తెలుగు ఫిలిం ఛాంబర్‌ దగ్గరికి కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఛాంబర్‌కు సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాధితురాలిపై ఎంతో కాలంగా వేధింపులు జరుగుతున్నాయని, ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతు వస్తున్నట్టు విచారణ తేలిసింది. ఈ విషయాలు బయటకు వెల్లడవ్వడంతో తాజాగా నార్సింగ్‌ పోలీసులకు జానీకి షాకిచ్చారు. ఆయనపై తాజాగా పోక్కో చట్టం కింద కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది. లైంగిక వేధింపుల కేసు నమోదైనప్పటి నుంచి జానీ మాస్టర్‌ పరారీ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్‌ నార్సింగ్‌ పోలీసులు జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

డ్యాన్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం

కాగా జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు, కేసు నమోదు అవ్వడం జనసేన పార్టీలో కీలక పదవిలో ఉన్న ఆయనపై పార్టీ వేటు వేసింది. అతడి పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తెలుగు ఫిలిం డ్యాన్స్‌ అండ్‌ టీవీ డ్యాన్స్‌ అసోసియేషన్‌కి జానీ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. జానీ వ్యవహారం బయటపడటంతో డ్యాన్స్‌ అసోసియేషన్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఫలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆదేశం మేరకు ఫేడరేషన్‌ అతడిని పదవి నుంచి తప్పించింది. అంతేకాదు డ్యాన్స్‌ అసోసియేషన్‌ నుంచి కూడా సస్పెండ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో మరో షాకింగ్‌ న్యూస్ బయటకు వచ్చింది. సహా కొరియోగ్రాఫర్‌పై ఇలాంటి దారుణానికి పాల్పడ్డ జానీపై అసోసియేషన్‌ తీవ్ర ఆగ్రహంతో ఉందట. దీంతో అసోసియేషన్‌ సభ్యులెవరూ జానీతో మాట్లాడోద్దంటూ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇలా రోజురోజుకు లైంగిక కేసులో జానీ మాస్టర్‌పై ఉచ్చు బిగిస్తుంది. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్‌ పరారీలో ఉన్నాడు.  

అసలేమైందంటే..

మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఢీ-12 డ్యాన్స్ షోలో పాల్గొంది. అప్పుడు ఇదే షోకు జానీ మాస్టర్‌ అలియా షేక్‌ జానీ భాషా జడ్జీగా వ్యవహరించాడు. అప్పుడే బాధిత యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె టాలెంట్‌ మెచ్చి ఆమెకు తన వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా ఆఫర్‌ ఇచ్చాడు. అలా 2019 నుంచి బాధిత యువతి జానీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రాజెక్ట్‌లో భాగంగా 2019లో ముంబై ఔట్‌డోర్‌ షూటింగ్‌ వెళ్లాడు. అప్పుడు తన వెంట ఇద్దరు అసిస్టెంట్స్‌ని తీసుకుని వెళ్లాడు. అందులో బాధిత యువతి ఒకరు. అప్పుడే ముంబైలో ఆమె ఉంటున్న హోటల్‌ గదికి వెళ్లి జానీ ఆమెపై బలవంతం చేసి లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు షూటింగ్‌ సెట్‌లోనూ ప్రైవేట్‌ పార్ట్స్‌ తాగుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపించింది. అంతేకాదు తనన పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడని, జానీ భార్య కూడా మతం మారాలని, తన భర్త పెళ్లి చేసుకోవాంటూ వేధిస్తున్నట్టు ఆమె ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించింది. 

Also Read: జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget