అన్వేషించండి

Rajamouli: జపాన్ భూకంపంపై స్పందించిన రాజమౌళి - జపనీస్ భాషలో ట్వీట్

Japan Earth Quake: జపాన్‌లో జరిగిన భూకంపాలు ఎంతోమందిని కదిలించాయి. అందుకే చాలామంది ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా రాజమౌళి కూడా దీని గురించి ట్వీట్ చేశారు.

Rajamouli about Japan Earth Quake ప్రపంచమంతా హ్యాపీగా న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్తున్న సమయంలో జపాన్‌లో భూకంపం అనే వార్త.. అందరినీ ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది. పైగా భూకంపమే కదా అని తేలిగ్గా తీసుకునేలా కాకుండా చాలా తీవ్రమైన భూకంపం సంభవించడంతో అక్కడ ఇళ్లు కూలిపోయాయి, చాలామంది ప్రజలు మరణించారు కూడా. అయితే ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు జపాన్ పట్ల తమ సానుభూతిని తెలియజేశారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా జపాన్‌కు సపోర్ట్‌గా ట్వీట్ చేస్తూ.. ఆ దేశమంటే తనకు ఎంత ఇష్టమో బయటపెట్టారు.

దానిగురించే ఆలోచన..
‘‘జపాన్‌ను భూకంపాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూసి చాలా కలవరంగా ఉంది. ఈ దేశానికి మన అందరి మనసుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనివల్ల అక్కడి ప్రజల జీవితాలు ఎలా ప్రభావితం అవుతున్నాయో అనే విషయంపైనే నా ఆలోచనలు ఉన్నాయి’’ అంటూ జపాన్ భూకంపాల విషయంపై ట్వీట్ చేశారు రాజమౌళి. జపనీస్ భాషలో ‘గుడ్ లక్ జపాన్’ అని పేర్కొన్నారు. జపనీస్ భాషలో ఇక ఎన్‌టీఆర్ సైతం వారం రోజులు జపాన్‌లోనే ఉన్నానని, అక్కడే షూటింగ్ చేశానని, ఇంటికి రాగానే ఈ వార్త వినాల్సి వచ్చిందని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. మరెందరో సెలబ్రిటీలు కూడా జపాన్ ధైర్యంగా ఉండాలని చెప్తూ.. అక్కడ మరణించిన వారికి సంతాపం తెలియజేస్తున్నారు.

షూటింగ్స్ కోసం మొదటి ప్రాధాన్యత జపాన్‌కే..
సినిమా షూటింగ్స్‌కు లొకేషన్స్ ఎంపిక చేసే సమయంలో ఆ లిస్ట్‌లో కచ్చితంగా జపాన్ పేరు ఉంటుంది. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు కూడా ఆ దేశంలో చిత్రీకరణను జరుపుకున్నాయి. రాజమౌళి సైతం తన సినిమాల్లో అక్కడి లొకేషన్స్‌ను ఉపయోగించుకున్నారు. ఇక అలాంటి అందమైన దేశాన్ని భూకంపాలు అతలాకుతలం చేస్తుండడంతో చాలామంది ఆ దేశంపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అక్కడి తీవ్రత ఏంటో ఇతరులకు తెలిసేలా చేస్తున్నారు. అందులో కొన్ని వీడియోలు అయితే చాలా భయంకరంగా.. చూసేవారినే భయపెడుతున్నాయి. అలాంటి తీవ్రత మధ్య అసలు ప్రజలు ఎలా బ్రతుకుతున్నారని మిగతా దేశాల ప్రజలు వాపోతున్నారు. జపాన్‌లోని సహాయక బృందాలు కుదిరినంత అందరికీ సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి.

తీవ్రమైన భూకంపం..
జపాన్ భూకంపం విషయానికి వస్తే... రిక్టర్‌ స్కేల్‌పై తీవ్ర 7.4గా నమోదైంది. సెంట్రల్ జపాన్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. Japan Meteorological Agency వెల్లడించిన వివరాల ప్రకారం..పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీరప్రాంతాలను అప్రమత్తం చేశారు. 5 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగిసిపడి తీర ప్రాంతాలను ముంచే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నీగట, తొయామా, ఇషికావా ప్రాంత ప్రజలకు అలెర్ట్ జారీ చేశారు. వాజిమా నగర తీరాన్ని మీటర్ కన్నా ఎక్కువ ఎత్తైన అలలు వచ్చి తాకే ప్రమాదముంది. ప్రస్తుతానికి ప్రాణ,ఆస్తి నష్టాల వివరాలు వెల్లడి కాలేదు. కానీ భూకంపాల వల్ల కూలిపోయిన భవనాల కింద చాలామంది ప్రాణాలు చిక్కుకుపోయి ఉన్నాయని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా ఈ విషయంపై అధికారికంగా స్టేట్‌మెంట్ ఇవ్వడానికి జపాన్ ప్రభుత్వం ముందుకు రాలేదు.

Also Read: గుండె తరుక్కుపోతోంది, జపాన్ ప్రజలూ ధైర్యంగా ఉండండి - ఎన్టీఆర్

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget