అన్వేషించండి

Raja Saab Glimpse: రాజా సాబ్ వచ్చాడు - రొమాంటిక్ హారర్ కామెడీతో ప్రభాస్... ఫ్యాన్ ఇండియా మెచ్చేలా గ్లింప్స్!

Prabhas Raja Saab First Glimpse: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న 'రాజా సాబ్' సినిమా ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ విడుదల చేశారు.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను పాన్ ఇండియా / వరల్డ్ ప్రేక్షకులు 'బాహుబలి'గా చూశారు. 'కల్కి 2898 ఏడీ' సినిమాలో భైరవుడిగా, కర్ణుడిగా చూశారు. అయితే... ఈ ఆరడుగుల ఆజానుబాహుడిని ఇప్పటి వరకు ఎవరూ చూడనటువంటి కొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు దర్శకుడు మారుతి!

రాజా సాబ్... రొమాంటిక్ హారర్ కామెడీ!
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ఫిల్మ్ 'రాజా సాబ్' (The Raja Saab). ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ చిత్రమిది. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ పేరుతో ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు. 

Watch Prabhas's The Raja Saab Glimpse Video: 'పాన్ ఇండియా'ను 'ఫ్యాన్ ఇండియా' అని పేర్కొన్నప్పుడే ఈ గ్లింప్స్, సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... ఫ్యాన్స్ అందరూ మెచ్చేలా ప్రభాస్ లుక్ డిజైన్ చేశారు మారుతి. 'కల్కి 2898 ఏడీ'తో కంపేర్ చేస్తే... కంప్లీట్ కొత్త లుక్, మేకోవర్‌లో చూపించారు.

Also Readబాలకృష్ణ బ్రాండ్ న్యూ అవతార్‌.. ఆహాలో 'అన్‌ స్టాపబుల్ 4 స్టార్ట్ చేసేది ఎప్పుడో తెలుసా?

వచ్చే ఏడాది వేసవికి 'రాజా సాబ్' విడుదల!
Raja Saab Release Date: 'రాజా సాబ్' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో... పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు రానున్నారు. ఏప్రిల్ 10, 2025 రిలీజ్ అని గ్లింప్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

'రాజా సాబ్' గురించి టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ... ''మా సంస్థలో ఇదొక  మెమొరబుల్ మూవీ. ఆల్రెడీ 40 పర్సెంట్ షూటింగ్ పూర్తి అయ్యింది. ఆగస్టు 2వ తేదీ నుంచి మరో భారీ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. డార్లింగ్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ గారిని స్క్రీన్ మీద చూపించబోతున్నారు దర్శకుడు మారుతి'' అని చెప్పారు.

Also Readహరీష్ శంకర్ vs టాలీవుడ్ మీడియా... స్టార్టింగ్ to 'మిస్టర్ బచ్చన్' వరకు - ఏం జరిగిందో తెల్సా?


Raja Saab Movie Cast And Crew: ప్రభాస్ హీరోగా మారుతి రచన, దర్శకత్వంలో పీపుల్  మీడియా ఫ్యాక్టరీ పతాకం టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న 'ది రాజా సాబ్'లో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: కార్తీక్ పళని, ఫైట్ మాస్టర్స్: రామ్ లక్ష్మణ్ - కింగ్ సోలొమన్, వీఎఫ్ఎక్స్: ఆర్.సి. కమల్ కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: తమన్.

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget